ETV Bharat / state

నెల్లూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి

author img

By

Published : Nov 28, 2020, 2:06 PM IST

నివర్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. వానలకు సోమశిలకు భారీగా వరద చేరడంతో...పెన్నా పరివాహక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించి.. బాధితులతో మాట్లాడారు.

Minister Gautam Reddy  visited  the flooded areas in nellore district
నెల్లూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి

నెల్లూరు జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి గౌతమ్ రెడ్డి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ముంపు ప్రాంతాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు. తుపాను‌ ప్రభావంతో సోమశిలకు భారీగా వరద రావడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. పెన్నా పరివాహక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చెజర్ల మండలం నాగుల వెల్లటూరు చెరువుకు పడిన గండిని మంత్రి పరిశీలించి.. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామం జల దిగ్బంధంలో ఉండటంతో నాటు పడవ ద్వారా గ్రామానికి చేరుకుని.. అక్కడి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆత్మకూరు, అనంతసాగరం, ఎయస్ పేటలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

ఇదీ చూడండి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్‌ సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.