ETV Bharat / state

తిరుపతి ఓటమితోనే వైకాపా ఫ్యాన్​కు ఎదురుగాలి : లోకేశ్

author img

By

Published : Apr 6, 2021, 8:38 PM IST

Updated : Apr 7, 2021, 5:09 AM IST

తిరుపతి ఉపఎన్నికలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు లోకేశ్​కు ఘనస్వాగతం పలికారు.

తిరుపతి ఓటమితోనే వైకాపా ఫ్యాన్​కు ఎదురుగాలి : లోకేశ్
తిరుపతి ఓటమితోనే వైకాపా ఫ్యాన్​కు ఎదురుగాలి : లోకేశ్

అభివృద్ధి మాట మరచి, అవినీతి, అరాచకంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైకాపాకు తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికలతో గుణపాఠం నేర్పాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఆయన ప్రచారం నిర్వహించారు. ఓం నగర్ నుంచి ముత్తుకూరు ఆర్టీసీ బస్టాండ్ వరకు పాదయాత్ర చేస్తూ, తేదేపాను గెలిపించాలని కోరుతూ ఓటర్లకు కరపత్రాలు అందించారు. పాదయాత్రకు తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగున హారతులిస్తూ లోకేశ్​కు బ్రహ్మరథం పట్టారు.

తిరుపతి నుంచే మార్పు..

తిరుపతి ఉప ఎన్నికల నుంచే మార్పు ప్రారంభం కావాల్సిన అవసరముందని ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పిలుపునిచ్చారు.

ఓ చేత్తో రూ.10 , మరో చెత్తో 100 దోపిడీ..

వైకాపా అధికారం చేపట్టిన తర్వాత ప్రజలపై అన్ని రకాలుగా భారాలు మోపుతూ, ఓ చేతితో పది ఇస్తూ, మరో చేతితో వంద రూపాయలు తీసుకొనే పరిస్థితి నెలకొందన్నారు. దుగరాజపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టు గురించి పట్టించుకునే నాథుడే కరవయ్యారని దుయ్యబట్టారు.

అమరావతిలో దొరకదు కానీ...

రాష్ట్రంలో ఇసుక ఇక్కడి ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండదని, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​లల్లో దొరుకుతుందని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరల తగ్గాలన్నా.. గాల్లో విహరిస్తున్న అధికార పార్టీ నేతలు కిందకి దిగాలన్న తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు.

'స్వతంత్రత కోసం పోరాడాలి'

1947కు ముందు స్వతంత్రం కోసం పోరాడామని, ఇప్పుడు స్వతంత్రంగా బతికేందుకు పోరాడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టు స్టే: తదుపరి కార్యాచరణపై సీఎం చర్చలు

Last Updated : Apr 7, 2021, 5:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.