ETV Bharat / state

'నెల్లూరు రూరల్ నియోజకవర్గలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు'

author img

By

Published : Feb 25, 2021, 3:44 PM IST

నెల్లూరు రూరల్ నియోజకవర్గలోని పలు డివిజన్లలో రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు... స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే.. కమిషనర్​తో చర్చించి, డివిజన్ల వారీగా వినతిపత్రాలను అందజేశారు.

Local MLA Kotamreddy Sridhar Reddy said that development work will be undertaken in Nellore rural constituency
నెల్లూరు రూరల్ నియోజకవర్గలో రూ. 20కోట్లతో అభివృద్ధి పనులు

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ దినేష్​కుమార్​ను డివిజన్ ఇన్​ఛార్జీలతో పాటు.. ఎమ్మెల్యే కలిశారు. అక్కడ నెలకొన్న ప్రధాన సమస్యలపై కమిషనర్​తో చర్చించి, డివిజన్ల వారీగా వినతిపత్రాలు అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, కార్పొరేషన్ జనరల్ ఫండ్స్​ను వినియోగించి దాదాపు రూ.20కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు శ్రీధర్​రెడ్డి చెప్పారు. వారం రోజుల్లో టెండర్లను పిలిచి, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వైఎస్సార్ నగర్​లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

అటవీ శాఖకు ఇచ్చేందుకు భూములను పరిశీలించిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.