ETV Bharat / state

శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ల కొరత.. 4 రోజుల్లోనే బాడీ డీకంపోజ్!

author img

By

Published : May 13, 2021, 3:58 PM IST

శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ల కొరత.. 4 రోజుల్లోనే బాడీ డీకంపోజ్
శవాన్ని భద్రపరిచేందుకు ఫ్రీజర్ల కొరత.. 4 రోజుల్లోనే బాడీ డీకంపోజ్

నెల్లూరు జిల్లా కేంద్రంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపర్చేందుకు సౌకర్యాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఫ్రీజర్ల సంఖ్యను పెంచాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. మరోవైపు శ్మాశానంలో ఖననం చేసేందుకు స్థలం కొరత నేపథ్యంలో విద్యుత్ యంత్రం అమర్చితే... దేహాలను క్రేమటోరియం పద్దతిలో కాల్చివేయవచ్చని సూచిస్తున్నారు.

నెల్లూరు జీజీహెచ్​లో ఉన్న మార్చురీ.. ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న 8 ఫ్రీజర్లు సైతం అవసరాలు తీర్చడం లేదు. కొవిడ్​ కారణంగా సగటున ప్రతిరోజూ ఎనిమిది మందికిపైగా మృత్యువాత పడుతున్నారు. మృతుల వివరాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం ఇవ్వడంలోనూ ఆలస్యం నెలకొంటోంది.

4 రోజుల సమయం..

మార్చురీ నుంచి బయటకు తరలించేసరికే సుమారు 4 రోజులకుపైగా సమయం పడుతుండటం కలవరపెట్టే అంశం. ఫ్రీజర్లు లేక, గదులు లేక దేహాలు కుప్పలుగా పడి ఉంటున్నాయి. 20కి పైగా శవాలను గదిలోనే కుప్పలుగా పడేస్తున్నారు. 4 రోజుల అనంతరం మృత దేహం డీ కంపోజ్ అవుతుండటం సమస్యగా మారింది. నెల్లూరు నగరంలోని బొడిగాడి తోట శ్మశానంలో వసతులు లేక ఖననం చేసేందుకూ ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ యంత్రం ఏర్పాటు చెస్తే మృతదేహాన్ని కాల్చివేయడం సౌకర్యంగా ఉంటుందని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

కంటతడి పెట్టిస్తున్న గర్భిణీ వైద్యురాలి 'చివరి సందేశం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.