ETV Bharat / state

నాయుడుపేట, సూళ్లూరుపేటల్లో భారీ వర్షాలు

author img

By

Published : Nov 25, 2020, 4:24 PM IST

heavy rains in nellore district
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు

నివర్ తుపాను ప్రభావంతో తెల్లవారుజాము నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు.. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేటల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు, రోడ్లు దెబ్బతిన్నాయి. జనజీవనం స్తంభించింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో.. నివర్ తుపాను ధాటికి తెల్లవారు జాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా వర్షం కురుస్తోంది. వరి పంటలు ఇప్పటికే నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణ, గ్రామీణ రహదారులు దెబ్బతిని.. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇదీ చదవండి:

తుఫాన్ ప్రభావంతో ఎగిసిపడుతున్న సముద్రపు అలలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.