ETV Bharat / state

heavy rains: రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Oct 17, 2021, 4:59 AM IST

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు(heavy rains) కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల రహదారులన్ని జలమయమయ్యాయి.

heavy rains
heavy rains

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా(srikakulam district) టెక్కలి నియోజకవర్గంలో 2 గంటల పాటు భారీ వాన పడింది. సంతోషిమాత ఆలయం రోడ్డు జలదిగ్బంధమైంది. వివిధ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరింది. సంతబొమ్మాళి మండలం బడేనర్సాపురంలో.... స్నానానికి చెరువుకు వెళ్లిన కృష్ణ ప్రమాదవశాత్తూ మరణించాడు.

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

చిత్తూరు జిల్లా..

తిరుపతి(tirupati)లో కురిసిన కుండపోత వానకు వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. డ్రైనేజీ నీళ్లు ఇళ్లల్లోకి రావటంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధురానగగర్‌లో వాహనాలూ మునిగిపోయాయి.

నెల్లూరు జిల్లా..

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో 2 గంటల పాటు పిడుగులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి బుచ్చిరెడ్డిపాళెం మండలంలో రెండు మూగజీవాలు మృతి చెందాయి.

ఇదీ చదవండి

కేరళలోని ఆరు జిల్లాల్లో రెడ్​ అలెర్ట్​.. రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.