ETV Bharat / state

ప్రతీ గింజ కొనుగోలు చెస్తామన్న ప్రభుత్వ హామీ.. అమలు కావట్లేదు : రైతులు

author img

By

Published : Mar 23, 2022, 6:43 PM IST

Farmers Protest at Nellore: ప్రతీ ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వ హామీ.. ఆచరణలో అమలు కావడంలేదని నెల్లూరు జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్​ చేస్తూ.. తెదేపా ఆధ్వర్యంలో నెల్లూరులో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు.

protest rally of farmers in Nellore
నెల్లూరులో రైతుల భారీ నిరసన ర్యాలీ

పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాట ధర కల్పించాలని నెల్లూరు రైతులు డిమాండ్​ చేశారు. కేంద్రాల్లో కొనుగోళ్లు మొక్కుబడిగా మారాయని.. గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు పేర్కొన్నారు. కేంద్రాల్లో ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి సవాలక్ష కారణాలు చెబుతూ.. ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ఆధ్వర్యంలో నెల్లూరులో రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెల్లచొక్కా, పంచా ధరించి జిల్లా రైతులు నెల్లూరులో కదంతొక్కారు. నర్తకీ కూడలి నుంచి జిల్లా కలెక్టరేట్​ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సాగు ఖర్చులు పెరిగాయని.. పంటకు ధర లేకపోవడంతో రైతులు అప్పులు పాలవుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. సంగంలో ఓ రైతుకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యయత్నం చేశాడని.. జిల్లాలో అనేక మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం.. తమ సమస్యను పరిష్కరించడంలేదని రైతులు విమర్శించారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆచరణలో అమలు కావడంలేదని అన్నారు. పంట పండించిన రైతుకన్నా.. దళారులే బాగా లాభపడుతున్నారని విమర్శించారు. గత రెండేళ్లుగా కొనుగోలు కేంద్రాల్లో పంటను కొనడంలేదని.. రైతులకు కేంద్రాలపై నమ్మకం పోయిందని రైతు నాయకులు విమర్శించారు.

ఇదీ చదవండి:
నాటుసారా మరణాలపై జగన్​ చెప్పేవన్నీ అసత్యాలే: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.