ETV Bharat / state

ఏ రాష్ట్రంలో లేని మీటర్లు ఆంధ్రాలోనే ఎందుకు: మాజీ ఎంపీ చింతా మోహన్

author img

By

Published : Dec 15, 2022, 2:54 PM IST

Chinta Mohan Comments on Agriculture Meters: దేశంలో రాష్ట్రంలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అవినీతికి రంగం సిద్ధమైంది... వ్యవసాయానికి మీటర్లు బిగించే వ్యవహారంలో ఈ తతంగం సాగుతోందన్నారు. ఏ రాష్ట్రంలో లేని మీటర్లు ఆంధ్రాలో మాత్రం ఎందుకు బిగిస్తున్నారో అంతుచిక్కడం లేదని భాజాపా, వైకాపాలపై వ్యతిరేకత మొదలైందని అన్నారు.

There is no welfare except crisis in the state
ఏ రాష్ట్రంలో లేని మీటర్లు ఆంధ్రాలో మాత్రం ఎందుకు

Ex MP Chinta Mohan Comments: రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయల అవినీతికి రంగం సిద్ధమైందని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. వ్యవసాయానికి మీటర్లు బిగించే వ్యవహారంలో ఈ తతంగం సాగుతోందని ఆయన నెల్లూరులో విమర్శించారు. ఆరు వేల రూపాయల విలువైన మీటర్​ను రూ.30 వేలకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

దేశంలోని మీటర్ల మాఫియా ద్వారా ఈ తతంగం సాగుతోంది. ఇందుకోసం కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 3600 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని మీటర్లు బిగించనున్నట్లు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని మీటర్లు ఆంధ్రాలో మాత్రం ఎందుకు బిగిస్తున్నారో అంతుచిక్కడం లేదన్నారు.

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల పనితీరు బాగాలేదని ధ్వజమెత్తారు. సెక్రటేరియట్​కు ఐఏఎస్ అధికారులు సక్రమంగా రావడం లేదని, వర్క్ ఫ్రం హోమ్ పాటిస్తున్నారని అన్నారు. బీజేపీ, వైసీపీలపై వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్రంలో సంక్షోభం తప్ప సంక్షేమం లేదని విమర్శించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.