ETV Bharat / state

'ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి'

author img

By

Published : Feb 12, 2020, 12:27 PM IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పంటను విక్రయించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్​ శేషగిరిబాబు కోరారు. కిసాన్ కార్డ్ వలన రైతులు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం తీసుకోవచ్చని తెలిపారు.

nellore district collector seshagiribabu
నెల్లూరు జిల్లా కలెక్టర్​ శేషగిరిబాబు

నెల్లూరు జిల్లా కలెక్టర్​ శేషగిరిబాబు

రబీ సీజన్​లో జిల్లాలో ఏడు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు-సూచనలు ఇవ్వడంతో రైతులు మంచి దిగుబడి సాధిస్తున్నారన్నారు. రైతుల కోసం ప్రభుత్వం 165 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఆ కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో చాలామంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ కార్డులు అందలేదని, బ్యాంకు అధికారులను సంప్రదించి కిసాన్ కార్డులు తీసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ఇవీ చూడండి...

భూరికార్డులు తారుమారు చేసిన అధికారులపై వేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.