ETV Bharat / state

గంగపుత్ర దివస్​ను ఘనంగా జరుపుకుందాం : వెంకటేశ్వర్లు బెస్త

author img

By

Published : Nov 7, 2020, 10:32 PM IST

Updated : Nov 8, 2020, 2:14 AM IST

ఈ నెల 21 వ తేదీన అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్ర దివస్​ను ఘనంగా జరుపుకోవాలని గంగపుత్ర మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు నెల్లూరులో సమావేశాన్ని నిర్వహించారు.

గంగపుత్ర దివస్​ను ఘనంగా జరుపుకుందాం : వెంకటేశ్వర్లు బెస్త
గంగపుత్ర దివస్​ను ఘనంగా జరుపుకుందాం : వెంకటేశ్వర్లు బెస్త

నెల్లూరు జిల్లా కేంద్రంలో గంగపుత్ర జాతీయ ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు బెస్త సమావేశం నిర్వహించారు. నవంబర్ 21న అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని " గంగపుత్ర దివస్"గా జరిపేందుకు జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సనాతన సంప్రదాయ మత్స్యకారులు బెస్తలు దక్షణాది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఉన్నారని వివరించారు.

భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ..

దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న గంగపుత్రులు.. ఎలాంటి అభివృద్దికి నోచుకోవటం లేదని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ - 25 లక్షలు , తెలంగాణ - 20 లక్షలు , కర్ణాటక 30 లక్షలు, తమిళనాడు - 10 లక్షలు , మహారాష్ట్ర - 10 లక్షల వారీగా తమకు జనాభా ఉందన్నారు. అయినప్పటికీ దశాబ్దాలుగా తాము అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురయ్యామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గంగపుత్ర దివస్​..​

గంగపుత్ర జాతి కుల దైవం గంగమ్మ తల్లి ఆశీర్వాదం కోరుతూ గంగపుత్ర దివస్ జరుపుకోవాలని బెస్త కుల బంధువులను కోరుతున్నామన్నారు. గంగాదేవికి పూల మాల సమర్పించి సకాలంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాలని వేడుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు చేయాల్సిందిగా గంగపుత్రులకు పిలుపునిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు నిండి చేపలు బాగా వృద్ధి చెందాలని కోరుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

గంగాదేవి ఆశ్వీర్వాదం కోరుతూ..

తమ కుల వృత్తి మత్స్య హక్కుల సాధన కోసం బెస్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బెస్తలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న పార్టీలు.. తమకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

గంగపుత్ర దివస్​ను ఘనంగా జరుపుకుందాం : వెంకటేశ్వర్లు బెస్త

ఇవీ చూడండి : ఒప్పంద వైద్య ఉద్యోగుల నిరసన... అధికారుల హామీతో విరమణ

Last Updated : Nov 8, 2020, 2:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.