ETV Bharat / state

రొయ్యల రవాణా మాటున.. నిషేధిత గుట్కా వ్యాపారం

author img

By

Published : Jun 7, 2020, 6:53 PM IST

రొయ్యల రవాణా మాటున నిషేధిత గుట్కాను రవాణా చేస్తున్న వైనాన్ని నెల్లూరు సీసీఎస్ పోలీసులు బయటపెట్టారు. వాహన డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. దందా సూత్రధారులను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

banned Gutka ilegal business
నిషేధిత గుట్కా పట్టివేత

పక్కా సమాచారంతో నెల్లూరు జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు 3.7 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. గుట్కా రవాణా చేస్తున్న వాహన డ్రైవర్ సయ్యద్ తన్వీర్​ను అరెస్టు చేశారు. రొయ్యలు తరలించే కంటైనర్ వాహనంలో గుట్కా అక్రమ రవాణా జరుగుతున్నట్లు సీఐ. బాజీజాన్ సైదా తెలిపారు.

నెల్లూరు నుంచి కేరళకు రొయ్యల లోడు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో తమిళనాడులోని కృష్ణగిరి నుంచి నిషేధిత గుట్కా, ఖైనీలను నగరానికి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. డబ్బుకు ఆశపడిన కారణగానే.. డ్రైవర్ గుట్కాలను తీసుకువచ్చాడన్నారు. పరారీలో ఉన్న అసలు వ్యాపారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ఇవీ చూడండి:

'ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు తప్పనిసరి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.