ETV Bharat / state

ఆసుపత్రి శ్లాబ్​ నుంచి పెచ్చులూడి గాయపడిన మహిళా సిబ్బంది

author img

By

Published : Mar 10, 2021, 11:00 PM IST

ప్రభుత్వ వైద్యశాల శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడి ఓ మహిళ గాయపడిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో సంభవించింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఓ గర్భవతి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది.

A woman was slightly injured when scales were blown from the slab of a government hospital in Indukurupeta mandal, Maipadu, Nellore district
ఆసుపత్రి శ్లాబ్​ నుంచి పెచ్చులు ఊడిపడి గాయపడిన సిబ్బంది

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులోని ప్రభుత్వ ఆసుపత్రి శ్లాబ్​ నుంచి పెచ్చులు ఊడిపడి ఓ మహిళ స్వల్పంగా గాయపడింది. గ్రామంలోని ప్రభుత్వ వైద్యశాల శిథిలావస్థకు చేరి, తరచూ పెచ్చులూడుతూ ప్రమాదాలకు కారణమౌతోంది. ఈ క్రమంలో ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా సిబ్బందిపై శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి.​ ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడగా.. పక్కనే ఉన్న ఓ గర్భవతి కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. వర్షాకాలంలో హాస్పిటల్ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి పునర్నిర్మాణానికి గతంలో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినా.. కార్యరూపం దాల్చలేదని వాపోయారు. కనీసం మరమ్మతులైనా చేయలేదని గ్రామస్థులు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి:

డబ్బులివ్వలేదని ఓటింగ్​కు దూరంగా గిరిజన కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.