ETV Bharat / state

ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లిన సోము వీర్రాజు.. అడ్డుకున్న పోలీసులు

author img

By

Published : Apr 3, 2023, 5:30 PM IST

Updated : Apr 4, 2023, 6:24 AM IST

Etv Bharat
Etv Bharat

Police Stopped Somu Veerraju: పల్నాడు జిల్లాలో ఇసుక రీచ్​లను పరిశీలించేందుకు వచ్చిన సోము వీర్రాజును వైకుంఠపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీర్రాజు రహదారిపై బైఠాయించిన ఆందోళన తెలిపారు. గుత్తేదారులు రేయింబవళ్లు ఇసుకను తవ్వి దోపిడీ చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు.

సోము వీర్రాజును అడ్డుకున్న పోలీసులు

Illegal Sand Mining in Palnadu: పల్నాడు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై అధికార పార్టీ, భారతీయ జనత పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పల్నాడు పర్యటన ఉద్రిక్తలకు దారితీసింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఇసుక రీచ్​ల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. అక్రమాలకు పాల్పడుతున్నవారిని కాకుండా.. అక్రమాలపై ప్రశ్నించే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని వీర్రాజు మండిపడ్డారు.

రహదారిపై బైఠాయించిన వీర్రాజు పేదలకు ఉచితంగా ఇసుక అందించాలని, ప్రస్తుతం ఉన్న ఇసుక పాలసీని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో ఇసుక రీచ్‌ లను పరిశీలించేందుకు వచ్చిన వీర్రాజును వైకుంఠపురం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా కొంతసేపు వీర్రాజు రహదారిపై బైఠాయించారు. ఇసుక రీచ్​లకు వెళ్తే పోలీసులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మిషన్లు పెట్టి ఇసుకను తవ్వేస్తున్నారని.. ఇది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమని చెప్పారు. ఇసుక పాలసీతో ప్రజలు నష్టపోతున్నారని... గుత్తేదారులు రేయింబవళ్లు ఇసుకను తవ్వి దోపిడీ చేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ఆ తర్వాత అమరావతిలో ఇసుక రీచ్ ను వీర్రాజు పరిశీలించారు.

ఆలోకం సుధాకర్ ఆరోపణలు: పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు సవాల్ స్వీకరించిన బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ బాబు.. అమరలింగేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ప్రమాణం చేసిన ఆలోకం సుధాకర్ అందుకు కట్టబడి ఉన్నట్లు చెప్పారు. తనకు ఎమ్మెల్యే పట్ల వ్యక్తిగతమైన ద్వేషం లేదని చెప్పారు. అక్రమంగా నదిలో రోడ్డు వేసి ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.

'ఇసుక దొంగల్ని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మాన్యువల్​గా తీయాల్సిన ఇసుకను.. మిషన్ పెట్టి తీస్తున్నారు. ఇసుకకు అధిక ధరపెట్టి బ్లాక్ మార్కెట్​లో అమ్ముకుంటున్నారు. ఇదే అంశం రాజమండ్రిలో జరిగితే మేం పోరాడాం. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కేసులు పెట్టినా ప్రభుత్వంలో ఇసుక అమ్ముతున్నారు. ఇలా ఇసుకను జనాలకు కాకుండా చేస్తున్నారు. మమ్మల్ని ఇసుక రీచ్​ల వద్దకు వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కానీ, అక్రమంగా మెషిన్లతో ఇసుక తరలించే వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఇసుక తరలించే అంశంపై ప్రశ్నించిన మా జిల్లా నాయకుడి కారుపై దాడి జరిగింది. ఇప్పటికైనా పోలీసులు చర్యలు చేపట్టి అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి.'- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated :Apr 4, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.