ETV Bharat / state

వైసీపీ ఎమ్మెల్యే తల్లి చనిపోయి ఐదేళ్లైనా తొలగించని ఓటు - పైగా రెండు చోట్ల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2023, 7:58 PM IST

Fake Votes at Narasa Raopet YCP MLA House: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోజురోజుకీ దొంగఓట్లు పెరిగిపోతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో సాక్షాత్తూ ఎమ్మెల్యే ఇంట్లోనే దొంగఓట్లు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్యే తల్లి చనిపోయి ఐదేళ్లు గడిచినా ఆమె ఓటు తొలగించకపోవడం.. పైగా ఆవిడకు రెండు చోట్ల ఓటుహక్కు ఉండటం స్థానికంగా కలకలం రేపుతోంది.

fake_votes_at_ycp_mla_house
fake_votes_at_ycp_mla_house

వైసీపీ ఎమ్మెల్యే తల్లి చనిపోయి ఐదేళ్లైనా తొలగించని ఓటు - పైగా రెండు చోట్ల

Fake Votes at Narasaraopet YCP MLA House: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తల్లి మరణించి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆమె ఓటును తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆమె పేరుతో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు నమోదై ఉండటం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాక్షాత్తూ ఎమ్మెల్యే ఇంట్లోనే వెలుగు చూసిన డబుల్ ఎంట్రీ ఓటుతో నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులకు తెలియకపోయినా కనీసం ఆమె కుటుంబసభ్యులకు అయినా సుబ్బాయమ్మ ఓటును తొలగించాలనే ఆలోచన రావాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.

ఉరవకొండలో తప్పులతడకగా ఓటర్ల జాబితా - ఒకే ఇంటి నెంబర్​తో పదుల సంఖ్యలో ఓట్లు

అధికారులు మరణించిన వారి లిస్టులు, అదే విధంగా రెండు ప్రాంతాల్లో నమోదైన ఓటరు పేర్ల కోసం ఇంటింటికి తిరిగి పరిశీలన చేస్తున్నామని చెబుతున్నా.. సాక్షాత్తు ఎమ్మెల్యే తల్లి పేరును తొలగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓటరు సర్వే లిస్టుల్లో ఎమ్మెల్యే తల్లి గోపిరెడ్డి సుబ్బాయమ్మ పేరుతో నరసరావుపేట 182వ బూత్ లో 458 నెంబర్​తో ఓటు ఉండగా.. రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్నపాలెంలో 30వ బూత్​లో 897 నెంబర్​తో మరో ఓటు వెలుగు చూసింది. టీడీపీ నేతలు ఆరోపిస్తున్న డెత్, డబుల్ ఎంట్రీ ఓట్లు బయట పడుతుండటంతో ఇది నిజమేనా అని వైసీపీ నేతల తీరుపై నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

దరఖాస్తు చేసినా జాబితాలో లేని ఓటర్లు - విధుల్లో నిర్లక్ష్యంపై ఆరుగురు బీఎల్వోల సస్పెన్షన్

TDP Leader Aravinda Babu on Fake Votes in MLA House: నరసరావుపేట నియోజకవర్గంలో దొంగ ఓట్లపై నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నరసరావుపేటలో 2019 నుండి ఇప్పటివరకు 12 వేల మంది చనిపోయినవారి ఓట్లు ఉంటే అధికారులు 3 వేలు మాత్రమే తొలగించారని దుయ్యబట్టారు. అదేవిధంగా దొంగ ఓట్లు, డబుల్ ఎంట్రీలను కూడా ఎక్కడా తొలగించిన దాఖలాలు లేవన్నారు. దొంగ ఓట్లను తొలగించడంతో ఎన్నికల సంఘం అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముసాయిదా ఓటర్ల జాబితాల్లో ఆసక్తికర విషయాలు మార్పులు చేయకుండానే

రొంపిచర్ల మండలంలోని పలు గ్రామాల్లో ఎప్పుడో చనిపోయిన వారి ఓట్లు కూడా అలానే ఉంచారని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు ఎమ్మెల్యే తల్లి చనిపోయి ఐదేళ్లు అవుతున్నా.. ఇంత వరకూ ఓట్ల జాబితాలో నుండి ఆమె ఓటును తొలగించకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం బుచ్చిపాపన్న పాలెంలో ఆరు వందల దొంగఓట్లు ఉన్నాయని అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి దొంగ ఓట్లపై చర్యలు తీసుకుని రాబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అరవింద బాబు కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.