ETV Bharat / state

కాల్పులకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి: చంద్రబాబు

author img

By

Published : Feb 2, 2023, 5:30 PM IST

chandar babu fire on Rompicharla gunfire incidence: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో నేడు జరిగిన కాల్పుల ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఆగ్రహించారు. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కొద్ది నెలల క్రితం బాలకోటి రెడ్డిపై కత్తులతో దాడి జరిగిందని..ఇప్పుడు ఏకంగా గన్‌తో కాల్పులు జరిపారని చంద్రబాబు ఆవేదన చెందారు.

chandra babu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు

chandar babu fire on Rompicharla gunfire incidence: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని అలవాలలో టీడీపీ మండలాధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కొంతమంది ప్రత్యర్థులు బాలకోటి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి.. గన్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాలకోటి రెడ్డి తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు హూటాహుటిన నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కాల్పుల కారణంగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఆసుపత్రిలో ఉన్న పార్టీ నాయకులు, వైద్యం అందిస్తున్న డాక్టర్లతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వివరాలను తెలుకున్నారు.

అనంతరం మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. కొద్ది నెలల క్రితం బాలకోటి రెడ్డిపై కత్తులతో దాడి జరిగిందని.. ఇప్పుడు ఏకంగా గన్‌తో కాల్పులు జరిపి, హతమార్చే ప్రయత్నం చేయడం దారుణమని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను చంద్రబాబు డిమాండ్ చేశారు.

అసలు ఏం జరిగిదంటే.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బాలకోటి రెడ్డి ఇంట్లోకి కొంతమంది దుండగులు ప్రవేశించి గన్‌తో బాలకోటి రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయాలపాలైన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు హూటాహుటిన నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.