ETV Bharat / state

సాయం పేరిట టోకరా.. అధికార పార్టీ నాయకుడిగా చెలామణీ అవుతూ మోసాలు..!

author img

By

Published : Mar 24, 2023, 11:07 AM IST

YSRCP Leader Cheated Woman VRA: అధికార పార్టీ నాయకుడిగా చలామణీ అవుతూ.. ప్రజల్ని మభ్యపెట్టి ఆర్థిక నేరాలకు పాల్పడిన బాగోతం బయటపడింది. VRA గా ఉన్న మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. 30 లక్షల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డ వ్యక్తిపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మోసం గురించి తెలిసి.. ప్రధాన నిందితుడ్ని వైసీపీ నుంచి ముందే బహిష్కరించారు.

ycp leader cheated woman vra
ycp leader cheated woman vra

YSRCP Leader Cheated Woman VRA: ఆ మహిళ భర్త వీఆర్వోగా విధుల నిర్వహిస్తు చనిపోయాడు. భర్త మరణం తర్వాత ఆమెకు వితంతు పెన్షన్​ కింద డబ్బులు వస్తున్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు సదరు మహిళకు వీఆర్​ఏ ఉద్యోగం రావడంలో సహాయం చేశాడు. ఇక అప్పటి నుంచి ఆమెకు మాయమాటలు చెప్పి అందినకాడికి డబ్బులు లాక్కుంటున్నాడు. అతను డబ్బులు తీసుకుంటున్నాడన్న విషయాన్ని చుట్టుపక్కల వారు గమనించి ఆమెకు అర్థమయ్యేలా చెప్పడంతో మోసాపోయానని గమనించిన ఆమె.. పోలీసులను ఆశ్రయించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి తహసీల్దారు కార్యాలయంలో VRO గా పనిచేసిన చెన్నారపు సత్యనారాయణ.. సర్వీస్ లో ఉండగానే 2019లో మృతి చెందారు. ఆయన భార్య మల్లేశ్వరికి.. జగ్గయ్యపేటకు చెందిన వైసీపీ సోషల్ మీడియా సమన్వయ కర్త, ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ దివ్యాంగుల అధ్యక్షుడు అయిన ఎర్రంశెట్టి ఆంజనేయులు.. VRA ఉద్యోగం రావడంలో సాయం చేశాడు. అయితే, భర్త చనిపోవడంతో ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయలు పరిహారం వస్తే.. కేవలం లక్ష రూపాయలే వచ్చాయని ఆంజనేయులు , సదరు మహిళను నమ్మించి మిగతా సొమ్మును నొక్కేశాడు.

అంతే కాక, మల్లేశ్వరి భర్త పెన్షన్ తోపాటు ఆమె జీతాన్ని ష్యూరిటీగా పెట్టి.. బ్యాంకులో రుణం తీసుకున్నాడు. మల్లేశ్వరికి నెలకు 18 వేలు జీతం వస్తుండగా.. 6 వేలే వస్తున్నాయంటూ ATM కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసుకుంటున్నాడు. మల్లీశ్వరికి సంతానం లేకపోవడాన్ని అదునుగా చేసుకుని.. తన మేనల్లుడిని ఆమె దత్తత తీసుకున్నట్లుగా తంతు నడిపించాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇంటిని తన మేనల్లుడికి దక్కేలా పత్రాలు సృష్టించాడు. ఇలా దఫదఫాలుగా 30 లక్షల రూపాయలకు పైగా మోసం చేశాడు" అని పోలీసులు తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

"ఎర్రంశెట్టి ఆంజనేయులు అనే జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తి. అతను ఆ మహిళకు రావాల్సిలన బెనిఫిట్స్​, ఉద్యోగం అన్ని ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర ఏటీఎం కార్డు తీసుకున్నాడు. సుమారుగా ఆ మహిళ దగ్గర ఉన్న 30 లక్షల రూపాయలను విడతల వారీగా తీసుకున్నాడు. ఆమెకు వీఆర్​ఏ జాబ్​ వచ్చిన తర్వాత.. ఆమె జాబ్​ని, ఆమె భర్త పెన్షన్​ని బ్యాంకులో పెట్టి 10లక్షల రూపాయలు తీసుకుని.. ఒక లక్ష ఆమెకి ఇచ్చి మిగతా డబ్బులను అతనే వాడుకున్నాడు. ఆమెకు పిల్లలు లేని కారణంగా ఆమె ఉంటున్న ఇల్లును తదనంతరం అతని మేనల్లుడికి చెందేటట్లుగా రిజిస్ట్రేషన్​ చేయించుకున్నాడు. వీటన్నింటిని పరిశీలించి అతనిపై కేసు నమోదు చేశాం"-జగ్గయ్యపేట పోలీసు

జరిగిన మోసం గురించి ఆంజనేయులును ప్రశ్నించగా ఇంట్లో ఉన్న ఆస్తి కాగితాలు దౌర్జన్యంగా తీసుకుపోయాడని బాధితురాలు తెలిపింది. ఎర్రంశెట్టి ఆంజనేయుల చేసిన మోసం విషయం తెలియడంతో రెండు నెలల క్రితమే వైసీపీ నుంచి బహిష్కరించారు.

"ఏదైనా సమస్య వస్తే.. ఎమ్మెల్యే, పోలీస్​స్టేషన్​, వార్డ్​ కౌన్సిలర్​ ఇంటింకి వెళ్లండి. ఇలా మోసం చేసే వాళ్లను మాత్రం నమ్మకండి. నా లాగా మోసపోయిన వారందరూ దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇతను మూలంగా నేను చావుఅంచులక వరకూ వెళ్లి వచ్చా. అతనికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే"-మల్లేశ్వరి, బాధితురాలు

సాయం పేరిట టోకరా.. అధికార పార్టీ నాయకుడిగా చెలామణీ అవుతూ మోసాలు..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.