ETV Bharat / state

పలు అంశాలపై టీడీపీ ఆందోళన.. వాడీవేడిగా నగర పాలక సంస్థ సమావేెశం

author img

By

Published : Jan 31, 2023, 8:37 PM IST

Etv Bharat
Etv Bharat

General Meeting of Vijayawada Municipal Corporation: ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్లు, నీటి మీటర్ల ఏర్పాటుపై అధికార, విపక్ష పార్టీల మధ్య వాడీవేడిగా.. విజయవాడ నగర పాలక సంస్థ సాధారణ సమావేశం జరిగింది. పెన్షన్లు తొలగింపుపై కౌన్సిల్లో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేయడంతో వారిని బయటకు పంపారు.

General Meeting of Vijayawada Municipal Corporation: విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సమావేశం టీడీపీ సభ్యుల ఆందోళనతో రసాభాసగా మారింది. అధికార, విపక్ష పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య వాడీవేడిగా సాగింది. సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం అవ్వగానే.. ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్స్, నీటి మీటర్ల ఏర్పాటుపై టీడీపీ, సీపీఎం సభ్యులు వీఎంసీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరసనకు దిగారు.

పెన్షన్లు తొలగింపుపై కౌన్సిల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పెన్షన్లు ఇవ్వాలని.. రద్దు చేసిన వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. గృహాలకు నీటి మీటర్ల ప్రతిపాదన విరమించుకోవాలన్నారు. పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, సీపీఎం సభ్యులను బయటకు పంపారు. కార్యాలయం బయట కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు.

రసాభాసగా విజయవాడ నగరపాలక సంస్థ సాధారణ సమావేశం

నగరపాలక సంస్థ బడ్జెట్​లో చేర్చాల్సిన అంశాలపై అధికార పార్టీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పలు ప్రతిపాదనలు చేశారు. ప్రతిపాదనలను పరిశీలిస్తామని మేయర్ తెలిపారు. నగరంలో చేపట్టాల్సిన రహదారులు, ఫుట్ పాత్​ల నిర్మాణంపై బడ్జెట్​లో ప్రతిపాదనలు వచ్చాయని మేయర్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.