చంద్రబాబు చైతన్య రథం మాయం.. పోలీసుల కనుసన్నల్లో దారి మళ్లింపు

author img

By

Published : Jan 6, 2023, 12:05 PM IST

Updated : Jan 6, 2023, 12:26 PM IST

చంద్రబాబు చైతన్య రథం

CBN Kuppam Tour : కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు సృష్టించేందుకు.. వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది ప్రభుత్వం. తాజాగా బాబు పర్యటించే చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరోవైపు కుప్పంలో పరిస్థితులపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై హత్యయత్నం కేసులు జగన్​ అభద్రతకు చిహ్నమని ఆయన అన్నారు.

Chandrababu Kuppam Tour : తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు ఉత్కంఠ రేపుతోంది. పర్యటనకు నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ప్రజల మధ్యకు వెళ్లేందుకు అధినేత సిద్ధమవుతుండటంతో.. ఆయన ప్రయాణించే చైతన్య రథాన్నిపోలీసులు దారి మళ్లించారు. కుప్పం గుడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి చంద్రబాబు చైతన్య రథాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. చంద్రబాబు పోలీస్‌ స్టేషన్‌కు వస్తారనే సమాచారంతో రాత్రికి రాత్రి చైతన్య రథం తరలించటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సౌండ్ వాహనాన్ని పోలీసు స్టేషన్​లోనే ఉంచి అది ఎవరికీ కనిపించకుండా భారీ వాహనాలను అడ్డుగా ఉంచారు. దీంతో చైతన్య రథాన్ని అప్పగించాలంటూ తెలుగుదేశం నేతలు నిరసనలకు సిద్ధమవుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ నిన్న కుప్పంలో చంద్రబాబు పాదయాత్ర చేశారు.

దిగజారిన రాజకీయానికి చరిత్రలో జగన్‌ ఒక పర్యాయపదమని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఆడబిడ్డలపై హత్యాయత్నం కేసులు జగన్‌ అభద్రతకు చిహ్నమన్నారు. మహిళలు తమను చంపడానికి వచ్చారని పోలీసులు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేసులు పెట్టిన అధికారుల దిగజారుడుతనాన్ని సమాజం అసహ్యించుకుంటోందని మండిపడ్డారు.

ఉత్కంఠ రేపుతున్న చంద్రబాబు కుప్పం మూడో రోజు పర్యటన

ఇవీ చదవండి:

Last Updated :Jan 6, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.