ETV Bharat / state

చంద్రబాబు స్కిల్​ కేసు - వక్రభాష్యం చెబుతున్న వైసీపీ నేతలపై టీడీపీ ఆగ్రహం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2024, 7:30 PM IST

TDP Leaders Fire on YSRCP Leaders: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు పిటిషన్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వైఎస్సార్సీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారనీ టీడీపీ నేతలు మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు.

TDP_Leaders_Fire_on_YSRCP_Leaders
TDP_Leaders_Fire_on_YSRCP_Leaders

TDP Leaders Fire on YSRCP Leaders : ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిటిషన్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధికార యంత్రాంగం వక్రభాష్యం చెబుతోందని ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అంశాలను ఎవరికి నచ్చినట్టు వాళ్లు రాయడానికి వీలు లేదని గుర్తు చేశారు. ఈ కేసులో సెక్షన్ 17A వర్తింపునకు సంబంధించి ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారని వివరించారు.

చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు : అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు పని చేస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైఎస్సార్సీపీ నేతలకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్​మెంట్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అధికార పార్టీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు స్కిల్​ కేసు - వక్రభాష్యం చెబుతున్న వైసీపీ నేతలపై టీడీపీ ఆగ్రహం

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ - ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో సీజేఐ ముందుకు

సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా అరెస్టు జరిగిన ఈ కేసులో 17Aపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ అభిప్రాయాలు చెప్పారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో ఇప్పటికీ ఒక్క ఆధారం చూపలేదన్నారు. ఈ కేసుల్లో నిధుల దుర్వినియోగం అయినట్లు కానీ పక్కదారి పట్టినట్లు కానీ ఇప్పటికీ నిరూపించలేకపోయారని విమర్శించారు. కేవలం రాజకీయ కక్షతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. దీంట్లో ఎప్పటికీ సఫలం కాలేరని అచ్చెన్నాయుడు అన్నారు.

పదేళ్లుగా తప్పించుకుంటున్న జగన్ : మంత్రి అంబటి రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతారనిమాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నేరస్థుడిని ఏ న్యాయస్థానం కాపాడదంటూ రాంబాబు చేసిన ట్వీట్‌కు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్‌ వీటన్నింటి నుంచి జగన్‌ తప్పించుకోలేకపోయారన్న విషయాన్ని రాంబాబు చెబుతున్నారని సోమిరెడ్డి ట్వీట్ చేశారు.

  • అదేంటో మా సంబరాల రాంబాబు అప్పుడప్పుడూ నిజాలే చెబుతాడు. 32 కేసులు, 16 నెలల జైలు జీవితం, పదేళ్లుగా బెయిల్..ఇవన్నీ తప్పించుకోలేకపోయారుగా.. https://t.co/rlTH0upWmJ

    — Somireddy Chandra Mohan Reddy (@Somireddycm) January 16, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పుపై హైకోర్టు న్యాయవాదులు ఏమన్నారంటే ?

గుడివాడ అమర్నాథ్‌పై ఆగ్రహం : సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబితేనైనా జగన్‌ తనకు సీటు ఇస్తారన్న నమ్మకంతో మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలుగుదేశం నేత అమర్నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu Quash Petition Judgement : స్కిల్‌ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ (Justice Aniruddha Bose), జస్టిస్‌ బేలా ఎం. త్రివేది (Justice Bela M.Trivedi)లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్‌ 17Aలో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని జస్టిస్ అనిరుద్ధ బోస్‌ స్పష్టం చేశారు. లేదంటే దాని విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని అన్నారు.

సెక్షన్‌ 17A సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు, ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం. త్రివేది పేర్కొన్నారు. సెక్షన్‌ 17A వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో, ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రిమాండు ఉత్తర్వులు కొట్టేయడానికి ఇద్దరు న్యాయమూర్తులు నిరాకరించారు.

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ - సీజేఐకి నివేదించిన ద్విసభ్య ధర్మాసనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.