ETV Bharat / state

మాజీ ఆర్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి..

author img

By

Published : Jan 7, 2023, 1:04 PM IST

Suspicious Death Of Farmer RFSL Director: హైదరాబాద్​కు చెందిన మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్ జక్కరాజు శివకుమార్ విజయవాడలో ఓ హెటల్​లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..దర్యాప్తు ప్రారంభించారు..

మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్
మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్

Suspicious Death Of Farmer RFSL Director: మాజీ ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ డైరెక్టర్ జక్కరాజు శివకుమార్ విజయవాడలోని డీ.వీ. మేనర్​ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నెల 5వ తేదీన బందరు రోడ్డులో డీ.వీ. మేనర్​ హోటల్లో ఆయన రూమ్ తీసుకున్నాడు. రూమ్ నుంచి 24 గంటల పాటు ఎటువంటి అలజడి లేకపోవడంతో.. హోటల్​ సిబ్బంది మరోక తాళంతో గది తలుపు తెరిచి చూడగానే.. విగత జీవిగా పడి ఉన్నాడు.. హోటల్​ సిబ్బంది మాచవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే ఘటనా స్థాలానికి పోలీసులు చేరుకున్నాడు.. మృతుడు హైదరాబాద్​లోని కూకట్​పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని.. మలేషియన్ టౌన్షిప్ లో నివాసం ఉంటున్న వ్యక్తిగా గుర్తించిన పోలీసులు, కుటుంబీకులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.