ETV Bharat / state

Reaction Other Party Leaders on Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ మంజూరుపై పవన్, పురందేశ్వరి హర్షం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 4:40 PM IST

Other_Party_Leaders_on_Chandrababu_Bail
Other_Party_Leaders_on_Chandrababu_Bail

Reaction Other Party Leaders on Chandrababu Bail: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్) మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌‌లు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.

Reaction Other Party Leaders on Chandrababu Bail: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్) మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌‌లు ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్‌ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan on Chandrababu Bail: స్కిల్‌ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. సంతోషం వ్యక్తం చేశారు. ''చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ లభించడం సంతోషకరం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, మరింత ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలి. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు విడుదల కోట్ల మంది కోరిక'' అని ఆయన అన్నారు.

Chandrababu Interim Bail in Skill Development Case: స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌

Daggubati Purandeshwari on Chandrababu Bail: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తాము మొదటి రోజే తప్పుపట్టామన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, విచారణ లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని గతంలోనే బీజేపీ ఖండించిందని ఆమె పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు నాయుడి పేరు లేకుండానే ఆయనను అరెస్టు చేసిన తీరు కూడా సరికాదని వివరించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచి పరిణామం అని పురందేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు.

TDP Leaders Celebrations over CBN Interim Bail: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌.. టపాసులు పేల్చుతూ టీడీపీ శ్రేణుల సంబరాలు

''టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బెయిల్‌ రావడం చాలా సంతోషంగా ఉంది. కానీ, వేరే కేసుల్లో మళ్లీ ఆయనను అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలున్నాయి. ఎలాంటి అడ్డంకులు లేకుండా చంద్రబాబును బయటకు పంపించాలి.''-చింతా మోహన్‌, కేంద్ర మాజీ మంత్రి

High Court Granted Interim Bail to Chandrababu: ఇక, చంద్రబాబు నాయుడి బెయిల్ విషయానికొస్తే.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలో అక్రమాలు జరిగాయంటూ.. సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. అనంతరం రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబును తరలించారు. గత 52 రోజులుగా ఆయన జైలులోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌‌ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. సోమవారం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం.. మంగళవారం చంద్రబాబుకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Balakrishna on CBN Gratitude Concert Program: "హైదరాబాద్​లో సీబీఎన్​కు తిరుగులేని మద్దతునిచ్చారు.. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.