ETV Bharat / state

Pattabhi వివేక హత్య కేసులో జగన్ దంపతులకు సీబీఐ నోటీసులు ఇవ్వాలి: టీడీపీ నేత పట్టాభి

author img

By

Published : Apr 22, 2023, 7:29 PM IST

Pattabhi
పట్టాభి

CBI investigation: వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి స్పందించారు. ఈ కేసులో సీబీఐ సీఎం జగన్​తో పాటుగా వైఎస్ భారతిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారిస్తేనే.. హత్య వెనుక అసలు దోషులు బయటకు వస్తారని పట్టాభి పేర్కొన్నారు.

Viveka murder case: సీఎం జగన్ దంపతులను విచారిస్తేనే వివేకా హత్యకు సంబంధించిన అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. వివేకా హత్య వెనుక సీఎం జగన్ కుటుంబం పాత్ర ఉందని పట్టాభి వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో జగన్, ఆయన సతీమణి భారతి పాత్ర గురించి సీబీఐ ఆరా తీయాల్సి ఉంటుందన్నారు. సీబీఐ జగన్ దంపతులకు సీబీఐ నోటీసివ్వాల్సిన అవసరం ఉందన్న ఆయన, వారివురిని విచారిస్తే, భవిష్యత్తులో జగన్ కాపురం చంచల్ గూడా జైలేనని పట్టాభి ధ్వజమెత్తారు.

భారతీ వ్యక్తిగత సహయకుడు నవీన్​కు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేసి ఏం మాట్లాడారని పట్టాభి ప్రశ్నించారు. సీఎం జగన్ ,భారతీ ఇచ్చిన పని పూర్తి చేశామని చెప్పడానికే అవినాష్ ఫోన్ చేశారా..! అని ఆయన నిలదీశారు. భారతీ తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేసే ప్రకాష్ రెడ్డి.. వివేకా పార్థివ దేహానికి కుట్లు వేయడానికి వెళ్లారా అని పట్టాభి ఆక్షేపించారు. వివేకా హత్య తర్వాత ఘటనస్థలికి వెళ్లిన వారందరూ భారతీ రెడ్డి మేనమామలు, లచ్చమ్మ సంతానమే వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారించిన తర్వాత ఇక జగన్ పర్మినెంట్ ప్యాలస్ చంచల్ గూడా జైల్ అని పేర్కొన్నారు. భారతీ పెద్దనాన్న కొడుకు వరుసకు అన్న అయిన ఈసీ సురేంద్రనాధ్ రెడ్డి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సురేంద్రనాధ్ రెడ్డికి ఆర్టిక్చర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ పదవి ఎందుకిచ్చారని నిలదీశారు. వైఎస్ వివేకాను అడ్డు తొలగించిన మర్నాడే కడప లోక్ సభ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పేరును ప్రకటించారని పట్టాభి తెలిపారు. సీఎం జగను దంపతులను విచారించేందుకు సీబీఐ ఖచ్చితంగా నోటీసిలివ్వాలని డిమాండ్ చేశారు.

వివేకానందరెడ్డి అంటే ఎప్పటి నుంచో జగన్​కు కక్ష ఉందని పట్టాభి ఆరోపించారు. అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వడం కోసమే వివేకాను హత్య చేశారని పట్టాభి ఎద్దేవా పేర్కొన్నారు. వివేకా అడ్డు తొలగించిన రెండు రోజుల అనంతరం అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఖరారు చేశారని పేర్కొన్నారు. ఇదే అంశంపై సీబీఐ జగన్ ను ప్రశ్నించాలని పట్టాభి డిమాండ్ చేశాడు. సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో జగన్ తన తమ్ముడు అవినాష్ రెడ్డికి అసెంబ్లీలో చర్చపెట్టి క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ హత్య కేసులో సీబీఐ భారతి రెడ్డి సైతం విచారించాలని పట్టాభి డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసు వివరాలు ప్రపంచానికి తెలియకముందే భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్​కు అవినాష్ రెడ్డి ఎందుకు ఫోన్ చేశాడని ప్రశ్నించారు. ఆ కోణంలో సీబీఐ వైఎస్ భారతిని విచారించాలని పట్టాభి డిమాండ్ చేశారు. జగన్, భారతి అప్పగించిన పని పూర్తయిందని చెప్పడానికి ఫోన్ చేశారా అంటూ పట్టాభి ఎద్దేవా చేశారు.

హత్యకేసును చంద్రబాబుపై నెట్టేయడానికి ప్రయత్నించారు: పట్టాభి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.