ETV Bharat / state

' ఆ అద్యాపకుడి.. లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు'

author img

By

Published : Apr 26, 2022, 3:34 AM IST

Lecturer Sexual harassment in NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సుధాకర్​.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... దీంతో అతడి వేధింపులు మరింతా పెరిగాయని ఆమె వాపోయారు. లెక్షరర్​ సుధాకర్ భారీ​ నుంచి తనను కాపాడాలని సదరు విద్యార్థిని వేడుకుంటున్నారు.

lecturer sexual harassment
lecturer sexual harassment

Sexual Harassment on Student: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడు సుధాకర్​పై ఓ విద్యార్థిని లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. వైధింపులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయింది. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు భర్త సాయంతో సమస్యను మీడియా దృష్టికి తీసుకొచ్చారు.

'నేను అంబేడ్కర్​ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా దూరవిద్యాలో మూడో సంవత్సరం చదువుతున్నా. తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గణితం అధ్యాపకుడు సుధాకర్ కొంత కాలంగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడు. విద్యార్థులకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులో నా ఫోన్​ నంబర్​ తీసుకొని మెసేజ్​ చేసేవాడు. పరీక్షలు రాసేందుకు వెళ్లిన ప్రతీసారి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. సదరు అద్యాపకుడిపై మరి కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా.. ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదు. నా భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించడంతో ఉన్నత విద్యా శాఖ కమిషనర్, రాజమండ్రి ఆర్జేడీ, మహిళా కమిషన్, అంబేడ్కర్​ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. ప్రిన్సిపల్, అధ్యాపకుడికి మెమోలు జారీ చేశారు' అని ఆమె చెప్పింది.

ముగ్గురు సభ్యులతో వేసిన కమిటీ తమను విచారించకుండానే.. ఆ అధ్యాపకుడికి అనుకూలంగా నివేదిక పంపారని వాపోయారు. వివాహిత కావడం, చదువుకు ఇబ్బంది అవుతుందనే భయంతో అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే ప్రిన్సిపల్ అండతో అధ్యాపకుడి ఆగడాలు మరింత శృతి మించాయని పేర్కొన్నారు. అధ్యాపకుడు సుధాకర్ నుంచి తమను కాపాడమంటూ.. కృష్ణాజిల్లా ఎస్సీ, కలెక్టర్, ఉన్నత విద్యా శాఖ ఉన్నతాధికారులకు రెండు రోజుల క్రితం రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తిరువూరు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఉండటంతో మంగళవారం సీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు మహిళ తెలిపారు.

ఇదీ చదవండి:

విద్యార్థిని స్నానం చేస్తున్న వీడియోతో వేధింపులు.. వ్యక్తి ఆరెస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.