ETV Bharat / state

కెన్యా మాజీ ప్రధాని సోదరుడికి హైదరాబాద్​ యశోద ఆసుపత్రిలో మోకీలు మార్పిడి

author img

By

Published : Nov 26, 2022, 8:04 PM IST

knee replacement surgery హైదరాబాద్​లోని యశోద ఆసుపత్రిలో కెన్యా మాజీ ప్రధాని సోదరుడికి మోకీలు మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావటంతో.. కెన్యా మాజీ ప్రధాని సోదరుడు రెండో రోజే నడవటానికి ప్రయత్నం చేశారు.

Yashoda Hospital in Hyderabad
యశోద ఆసుపత్రి వైద్యులు

knee replacement surgery: కెన్యా మాజీ ప్రధాని రైలా ఓడింగా సోదరుడు, సియాయా కౌంటీకి చెందిన సెనేటర్‌ ఒబురు ఒడింగాకు హైదరాబాద్‌ యశోద ఆస్పుత్రిలో మోకీళ్ల మార్పిడి చికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌, మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్‌ దశరథ్‌ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చికిత్స విజయవంతమైంది. ఒడింగా గత కొన్నేళ్లుగా మోకీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఎడమ మోకీలు పూర్తిగా సమస్యతో బాధ పడుతున్నారు. మోకీలు బాధతో ఆయన అడుగు తీసి అడుగు వేయలేక పోయారు.

తొలుత యూరఫ్‌ దేశాల్లో చికిత్స కోసం సంప్రదించగా.. అక్కడ పరిక్షలు చేసి వైద్యం అందించారు. ఆ తరవాత కొన్ని రోజులకు సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఒబురు స్నేహితుల సలహాతో.. హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ దశరథరామిరెడ్డిని సంప్రదించారు. ఒబురు ఈ నెల 7వ తేదీన ఆస్పత్రిలో చేరగా మరుసటి రోజున సర్జరీ చేసినట్లు డాక్టర్‌ దశరథ రామిరెడ్డి తెలిపారు. శస్త్ర చికిత్స జరిగిన రెండో రోజునే వాకర్‌ సహాయంతో నడిపించినట్లు వైద్యులు దశరథ రామిరెడ్డి వివరించారు. కెన్యా కంటే ఇక్కడు తక్కువ ఖర్చులోనే వైద్య సేవలు అందుతున్నట్లు ఒబురు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.