ETV Bharat / state

Nagababu: 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ముందుకు నడపిస్తా: నాగబాబు

author img

By

Published : Apr 15, 2023, 4:44 PM IST

Janasena State General Secretary: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తనకు అప్పగించిన పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని నాగబాబు స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న చిన్నచిన్న విభేదాలను పరిష్కరించేలా చొరవ తీసుకుంటానని చెప్పారు. 2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ముందుకు నడపిస్తానని స్పష్టం చేశారు.

Janasena State General Secretary
Janasena State General Secretary

Janasena State General Secretary: ప్రజలకు సుపరిపాలన అందించాలనేదే తమ విధానమని.. ప్రభుత్వంపై ఏదోకటి విమర్శ చేయాలనేలా కాకుండా,.. పాలనలో జరుగుతున్న తప్పిదాలను ప్రజలకు తెలియజెప్పేలా సద్విమర్శలతో ముందుకెళ్తామని.. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అనంతరం తన అభిప్రాయాలను వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. జనసైనికుడిగా.. మహోన్నత ఆశయంతో పనిచేసే నాయకుడికి క్రమశిక్షణ గల కార్యకర్తగా.. జనసేన పార్టీలో తన ప్రస్థానం మొదలైందని.. 2019 నుంచి పార్టీ కోసం క్రీయాశీలకంగా పనిచేస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేశానని చెప్పారు.

జనసైనికులు, వీర మహిళలలను తరుచూ కలిసే అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకు సాగానని.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న జనసైనికులు, వీర మహిళలను సమన్వయపరుస్తూ.. వారి వెన్నంటే నడిచేలా తన ప్రయాణం సాగిందంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్.. తన మీద ఉన్న నమ్మకంతో జనసేన పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను అప్పగించారని.. తనకు ఇదో బృహత్తరమైన బాధ్యతగా భావిస్తానని చెప్పారు. పార్టీ శ్రేయస్సు కోసం తనకు పవన్ కల్యాణ్ అప్పగించిన బాధ్యతలను అంతే శ్రద్ధాశక్తులతో పూర్తి చేస్తానని.. ప్రతి అడుగు జనసైనికులను, వీర మహిళలను ముందుకు నడిపే విధంగా ఉంటుందన్నారు.

పాలకుల తప్పిదాలను బలంగా ప్రశ్నించగల సత్తా జనసేన పార్టీకి ఉందని.. క్షేత్రస్థాయిలో జనసైనికులు, వీర మహిళలు నిత్య జాగృతతో ఉంటూ, పాలకుల తప్పొప్పులను తెలియజేస్తూనే ఉంటారని అన్నారు. వారిలో పోరాట స్ఫూర్తిని నింపిన పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న కార్యకర్తలందరికీ అండగా నిలుస్తామని.. వారికి ఎలాంటి ఆపద వచ్చినా వారి వెన్నంటే జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. వీలైనంత వరకు ఎక్కువమందిని ప్రత్యక్షంగా కలుస్తానని.. వారిలో ఉన్న రాజకీయ ఆలోచనలకు, పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచేలా ప్రోత్సహిస్తానని.. నిత్యం కార్యకర్తలతో కలిసి పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తానని నాగబాబు తెలిపారు.

జనసేన పార్టీలో కొత్త బాధ్యతలు చేపట్టిన నాగబాబు.. కార్యకర్తలకు అండగా నిలుస్తానంటూ!

పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే చాలా బాధ్యతలు ఉంటాయి.. ఇదివరకు చేసిన దానికంటే ఏక్కువ బాధ్యతతో పని చేయాల్సిన బాధ్యత ఏర్పడింది. చిన్న చిన్న గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని సామరస్యంగా పరిష్కరించాలి. అన్ని పార్టీలతో పోలిస్తే చాలా తక్కువ సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని పరిష్కరించి అందరినీ కలుపుకు వెళ్లడం నా బాధ్యత.. ఆయన నాకు అప్పగించిన పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చిత్తశుద్ధితో కష్టపడి సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని.. పవన్‌ కల్యాణ్ గారికి, జనసేన నాయకులకు, వీర మహిళలలకి, కార్యకర్తలకు మనవి చేసుకుంటున్నాను.- నాగబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.