ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు

author img

By

Published : Mar 8, 2023, 10:09 PM IST

Updated : Mar 9, 2023, 6:54 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

International Womens Day Celebrations : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలు సందడి చేశారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలకు సన్మానం చేశారు. పలువురు ప్రముఖులు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

International Womens Day Celebrations : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు దేశ నిర్మాణం, జాతీయ సమగ్రత, శాంతి, సామరస్యాన్ని నిలబెట్టడంలో గొప్ప పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ ప్రశంసించారు. మహిళా సమానత్వం, సాధికారత కోసం టీడీపీ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అతివలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన మహిళలు అనేక రంగాల్లో తిరుగులేని నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు.

వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడాలన్నా, సాధికారిత సాధించాలన్నా చట్ట సభల్లో వారి సంఖ్యాబలం పెరగాలని అభిలషించారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ స్త్రీలు సంపూర్ణ సాధికారిత సాధించేలా, స్వేచ్ఛగా జీవించేలా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆకాంక్షించారు. వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ప్రభుత్వాలు స్త్రీలపై హింసను మాత్రం అరికట్టలేకపోతున్నాయి : మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో మహిళా సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు స్త్రీలపై హింసను మాత్రం అరికట్టలేకపోతున్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నెల్లూరు, కందుకూరు, కావలిలో ర్యాలీలు నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడ టూ టౌన్ నెహ్రూ బొమ్మ కూడలిలో ర్యాలీ నిర్వహించారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి మహిళా దినోత్సవం నిర్వహించారు.

లండన్‌లో "తెలుగు లేడీస్ ఇన్ యూకే" గ్రూపు ఆధ్వర్యంలో : వైఎస్సార్‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తమ మహిళా పోలీసులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గాదంకి టోల్ ప్లాజా వద్ద మేనేజర్ కృష్ణారావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. లండన్‌లో "తెలుగు లేడీస్ ఇన్ యూకే" గ్రూపు ఆధ్వర్యంలో 250 మందికి పైగా తెలుగు మహిళలు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 9, 2023, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.