ETV Bharat / state

జీవితంలో ఒక్కసారైనా భవానీ ద్వీపాన్నిసందర్శించాలి: నటి ఇంద్రజ

author img

By

Published : Jan 15, 2023, 10:09 PM IST

Vijayawada: విజయవాడ భవానీ ద్వీపానికి రావడంతో చాలా గొప్ప అనుభూతిని పొందానని.. ప్రముఖ నటి ఇంద్రజ అన్నారు. సంక్రాంతి సందర్భంగా విజయవాడ వచ్చిన ఆమె... భవానీ ద్వీపాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇంద్రజ పాల్గొన్నారు. మహిళలతో కలిసి కోలాటం ఆడారు. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. ద్వీపం మధ్యలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

Indraja visited Bhavani island
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా భవానీ ద్వీపాన్నిసందర్శించాలి: నటి ఇంద్రజా

భవానీ ద్వీపాన్ని సందర్శించిన ఇంద్రజా

Vijayawada: ప్రకృతి సిద్దంగా ఏర్పడిన భవానీ ద్వీపం అద్బుతంగా ఉందని ప్రముఖ నటి ఇంద్రజ తెలిపారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ భవానీ ద్వీపానికి విచ్చేసిన ఇంద్రజ.. అక్కడ ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కళారూపాలను తిలకించారు. కుండల తయారీలో పాల్గొని సందడి చేసి... మహిళలతో కలిసి కోలాటం ఆడారు. తాను భవానీ ద్వీపానికి రావడం ఇదే తొలిసారని, భవానీ ద్వీపం చూడటం గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ద్వీపం మధ్యలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భవానీ ద్వీపాన్ని ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు. ప్రకృతి ఇచ్చిన భవానీ ద్వీపం విజయవాడలో ఉందని చాలా మందికి తెలియదని చెప్పారు. పర్యాటక శాఖ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

భవానీ ద్వీపం రావడం ఇదే తొలిసారి ..ముందుగా రోజా గారికి థ్యాంక్స్​.. నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్​ కలిగింది. పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ద్వీపం మధ్యలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు తమ జీవితంలో భవానీ ద్వీపాన్ని ఒక్కసారైనా సందర్శించాలి. భవానీ ద్వీపం విజయవాడలో ఉందని చాలా మందికి తెలియదు. పర్యాటక శాఖ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం.- ఇంద్రజా, ప్రముఖ సినీ నటి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.