ETV Bharat / state

విజయవాడలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు - 'అంతా నా ఇష్టం' అంటున్న వైసీపీ ఎమ్మెల్యే!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 12:26 PM IST

Updated : Nov 21, 2023, 2:19 PM IST

Illegal_Constructions_in_Vijayawada
Illegal_Constructions_in_Vijayawada

Illegal Constructions in Vijayawada: వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి విజయవాడ నగరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నా కార్పొరేషన్ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. చర్యలు తీసుకుంటే బదిలీ వేటు పడుతుందని అధికారులు మిన్నకుండిపోతున్నారు. పేదలు చిన్నపాటి గృహాలు నిర్మించుకుంటే ఎన్నో నిబంధనలు పెట్టే అధికారులు.. కళ్లముందే పెద్దలు అక్రమాలకు పాల్పడుతున్నా కనీసం స్పందించడం లేదు.

Illegal Constructions in Vijayawada: విజయవాడలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు - 'అంతా నా ఇష్టం' అంటున్న వైసీపీ ఎమ్మెల్యే!

Illegal Constructions in Vijayawada: విజయవాడలోని ఓ నియోజకవర్గానికి ఆయన శాసనసభ్యుడు. తన కుటుంబ సభ్యులు ముగ్గురి పేరిట గవర్నరుపేట బీసెంట్ రోడ్డు - గోపాలరెడ్డి రోడ్డుకు అనుబంధంగా ఉన్న పెద్దిబొట్లవారి వీధిలో 197.24 చ.మీ. స్థలం ఉంది. అందులో 19.31 చ.మీ. స్థలం రహదారి విస్తరణ కింద పోగా మిగిలిన స్థలంలోనే నిబంధనల మేరకు భవనం కట్టుకునే వీలుంది.

ఇక్కడ భవన నిర్మాణ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోగా, 2022 అక్టోబర్​లో స్టిల్ట్, నేల, మొదటి, రెండు అంతస్తులను 12.45 మీటర్లలో నిర్మించేందుకు నగరపాలక సంస్థ ప్రణాళికాధికారులు అనుమతిని ఇచ్చారు. దాని ప్రకారం స్టిల్ట్ ఫ్లోర్లో సర్వెంట్ క్వార్టర్, మరుగుదొడ్డి, మెట్లు, లిఫ్టు నిర్మించుకోవాలి. గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీసు, వెయిటింగ్ హాలు, మరుగుదొడ్డి, మెట్లు, లిఫ్టు, మొదటి, రెండు అంతస్తుల్లో వ్యాయామశాలలు, మరుగుదొడ్లు, లిఫ్టు, మెట్ల నిర్మాణానికి అనువుగా ప్లాన్ మంజూరయ్యింది.

మంజూరు చేసిన ప్లాన్​కు భిన్నంగా ప్రస్తుతం నిర్మాణం సాగుతోంది. ప్లాను ప్రకారం 4 శ్లాబులే వేయాలి కానీ అక్రమంగా రెండు అంతస్తులు అదనంగా నిర్మించారు. వాస్తవానికి 12.45 మీటర్ల మేరకే కట్టడం ఉండాలి. అయితే 6.22 మీటర్లు అదనంగా కట్టారు. పైగా దానిపై మరో అంతస్తు అక్రమంగా నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో నగరంలో పలుచోట్ల అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

దేశంలో అనేక అక్రమ కట్టడాలు నేలమట్టం అయ్యాయి, మరి రుషికొండ విషయంలో అదే జరిగితే ప్రజాధనం వృథాకు బాధ్యులెవరు?

ప్లాన్​కు భిన్నంగా మరింత ఎత్తు నిర్మించాలంటే 119 జీవో ప్రకారం బిల్డింగ్​ ఏరియాలో కొంత కార్పొరేషన్కు మార్టిగేజ్ చేయాలి. రహదారి విస్తరణ కోసం.. కొంత స్థలాన్ని కార్పొరేషన్​కు గిఫ్టుగా ఇవ్వాలి. ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించి భవనం నిర్మిస్తుంటే అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు.

అక్రమ నిర్మాణంపై స్థానికులు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. శాసనసభ్యుడు.. ఉన్నతాధికారులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం, చర్యలు తీసుకుంటే బదిలీ తప్పదని హెచ్చరిక పంపడంతోనే బాధ్యులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కమిషనర్, పట్టణ ప్రణాళిక ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

Illegal constructions in Addanki: వైఎస్సార్సీపీ నేత ఫోన్..! నిలిచిపోయిన అక్రమ కట్టడాల కూల్చివేత

ఉన్న స్థలంలో అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు భవన నిర్మాణ, అగ్నిమాపక శాఖ నిబంధనలు అడ్డుగా నిలుస్తాయి. ఒకవేళ అదనపు అంతస్తులు నిర్మించాలనుకుంటే టీడీఆర్ బాండ్లు సమర్పించాలి. అదనంగా నిర్మించే ప్రతి అంతస్తుకూ దాదాపు 43.34 లక్షల రూపాయలు విలువైన బాండ్లు పెట్టాలి. ఇప్పటికే అక్రమంగా రెండు అదనపు అంతస్తులు నిర్మించిన నేపథ్యంలో 86.68 లక్షల రూపాయల విలువైన బాండ్లు ఇవ్వాలి. వీటితో పాటు కార్పొరేషన్​కు కొంత మొత్తాన్ని తనఖా పెట్టడం, రహదారి విస్తరణకు స్థలాన్ని కార్పొరేషన్​కు కొంత స్థలం గిఫ్టుగా ఇవ్వడం కూడా చేయాలి.

కానీ, ఆ నిబంధనలన్నీ ఉల్లంఘించి భవనం నిర్మిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడటం లేదు. అక్రమ నిర్మాణంపై స్థానికులు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టాడాలు చేపట్టిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విశాఖలో 10 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు!

Last Updated :Nov 21, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.