ETV Bharat / state

HC Adjourned Jagan Kodi Kathi Case Petition: కోడికత్తి కేసులో జగన్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ... 6 వారాలకు వాయిదా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 2:48 PM IST

HC_Adjourned_Jagan_Kodi_Kathi_Case_Petition
HC_Adjourned_Jagan_Kodi_Kathi_Case_Petition

HC Adjourned Jagan Kodi Kathi Case Petition: కోడికత్తి కేసులో జగన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

HC Adjourned Jagan Kodi Kathi Case Petition: కోడి కత్తి కేసులో లోతైన దర్యాప్తు చేయాలని గతంలో సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను 6వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో జరుగుతున్న కోడికత్తి కేసు విచారణపై 8వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

కాగా.. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో.. లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సీఎం జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు. కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలంటూ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో (సాక్షుల విచారణకు షెడ్యూల్‌ ప్రకటించి, వాంగ్మూలాల నమోదు దశలో) జగన్‌ పిటిషన్‌ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు.

Kodikatti Case Updates: కోడికత్తి కేసులో శ్రీనివాస్​కు దళిత సంఘాల మద్దతు.. 'న్యాయం జరిగే వరకూ పోరాడుతాం'

నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్‌ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారని అన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరిపించాలని కోరారు. ఎన్‌ఐఏ కోర్టు జులై 25వ తేదీన ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో జగన్‌ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటషన్‌పై నేడు విచారణ చేపట్టింది. తదుపరి విచారణను మరో 6వారాలకు వాయిదా వేసింది.

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ పొడిగింపు: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ రిమాండ్‌ను ఈనెల 27 వరకు విశాఖ ఎన్ఐఏ ఏడీజే కోర్టు పొడిగించింది. ఈ మేరకు నిందితుడు శ్రీనివాస్‌ను ఈ నెల 13న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవాదితో పోలీసులు మాట్లాడనీయట్లేదన్న నిందితుడు శ్రీనివాస్‌ విచారణ సమయంలో జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదేళ్ల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు.

Kodi Katthi Case Trial Adjourned కోడికత్తి కేసులో జగన్ హాజరుపై ఎన్‌ఐఏ కోర్టులో వాదోపవాదాలు.. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా

కోర్టుకు హాజరుకాకుండా: మరోవైపు చాలా కాలంగా జగన్ కోర్టుకు హాజరుకాకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. తాను కోర్టుకు హాజరైతో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలని అన్నారు. దీనిపై ప్రజాసంఘాలు, దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు దళితుడు కావడం వల్ల ఇబ్బంది పెడుతున్నారని.. సుమారు అయిదు సంవత్సరాల నుంచి కోర్టుకి హాజరుకావడానికి జగన్ తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు.

Kodi Katti Case latest Updates : 'వచ్చే ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రంగా కోడికత్తి కేసు!' ఐదేళ్లవుతున్నా దొరకని బెయిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.