ETV Bharat / state

సరికొత్త ఆలోచనలకు నాంది - నూతన ఎంటర్​ప్రెన్యూర్​కు శ్రీకారం హ్యాకథాన్​ పోటీలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 5:54 PM IST

Hackathon Competitions in Vijayawada : విద్యార్థుల సరికొత్త ఆలోచనలకు వేదికగా నిలుస్తున్నాయి హ్యాకథాన్​ పోటీలు. ప్రధాని మోదీ పిలుపుతో 2017 నుంచి స్మార్ట్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో నోడల్ సెంటర్లను ఏర్పాటు చేయగా ఈ వైజ్ఞానిక పోటీలకు విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ కళాశాల వేదికయ్యింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలాంటి ఆవిష్కరణలు రూపొందించారు? అవి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడనున్నాయో ఈటీవి భారత్​లో తెలుసుకుందాం!

hackathon_competitions
hackathon_competitions

Hackathon Competitions in Vijayawada : ఉద్యోగం కోసం వేచిచూసే వారిలా కాకుండా ఒకరికి ఉపాధినిచ్చే ఎంటర్‌ప్రెన్యూర్‌లా మారేందుకు విద్యార్థులకు తోడ్పడుతున్నాయి హ్యాకథాన్‌ పోటీలు.
సరికొత్త విజ్ఞానమంటే తరగతి గదుల్లోనే కాదు సమాజంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించటమే అనే లక్ష్యంతో విద్యార్థులను ప్రోత్సహించేందుకు జాతీయస్థాయిలో స్మార్ట్ హ్యాకథాన్​ను నిర్వహిస్తుంది. వివిధ విభాగాల్లో దేశ వ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. జాతీయస్థాయి హ్యాకథాన్ నోడల్ సెంటర్​ను విజయవాడ పీవీపీ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేశారు. 10 రాష్ట్రాల నుంచి విద్యార్ధులు పోటీల్లో పాల్గొన్నారు. కార్పోరేట్ కంపెనీలకు ఎదురవుతున్న సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారం చూపుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులపై యువ కథనం.

సరికొత్త ఆలోచనలకు నాంది - నూతన ఎంటర్​ప్రెన్యూర్​కు శ్రీకారం హ్యాకథాన్​ పోటీలు

Hackathon is a Platform to Grow as an Entrepreneur : విద్యార్థి దశలోనే ఎంటర్​ప్రెన్యూర్​గా ఎదిగేందుకు హ్యాకథాన్ వేదికగా మారుతోంది. ఓ చిన్న ఐడియా పెద్ద సమస్యను పరిష్కరిస్తోంది. కార్పోరేట్ సంస్థలకు కావాల్సిన రీతిలో నూతన సాఫ్ట్​వేర్ యాప్​లు రూపకల్పన చేసే కేంద్రంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మారుతోంది. సమాజంలో ప్రజలకు ఎదురయ్యే కష్టాలకు పరిష్కారమార్గం చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి నూతన ఎంటర్‌ప్రెన్యూర్‌గా తీర్చిదిద్దేందుకు హ్యాకథాన్‌ పేరుతో 2017లో జాతీయ స్థాయి పోటీలను ప్రారంభించింది. దీన్ని వేదిక చేసుకుని చాలా మంది విద్యార్థులు తమ కలలను నిజం చేసుకున్నారు. పెద్ద పెద్ద సంస్థలు తమకు సాఫ్ట్ వేర్, వెబ్ సైట్లు, యాప్​లు, సైబర్ సెక్యూరిటీల్లో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం పొందుతున్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 47 ప్రాంతాల్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్​ను నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విజయవాడలోని ప్రసాద్ వీ పొట్లూరి సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కళాశాలలో నోడల్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​తో పాటు మొత్తం 10 రాష్ట్రాల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
Hackathon Program in Vijayawada : విజయవాడలో జరుగుతున్న హ్యాకథాన్‌ కార్యక్రమంలో 27 బృందాలు పాల్లొన్నాయి. పలు సంస్థల నుంచి ప్రతినిధులు వచ్చి తమకు కావాల్సిన అవసరాలను విద్యార్థులకు చెబుతారు. 36 గంటల్లో విద్యార్థులు తమకు ఇచ్చిన పనిని ముగిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునికమైన సాఫ్ట్ వేర్​లను తయారు చేస్తారు. ప్రతీ ఏడాది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఈ పోటీల్లో పాల్గొనే వాళ్లు. ప్రస్తుతం తమ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఏర్పాటు చేయటం చాలా ఆనందంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ శివాజీ చెబుతున్నారు. ఐదు అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Thousands of Students Attended the Hackathon Program : జాతీయ స్థాయి పోటీలు తమ కళాశాలలో ఏర్పాటు చేయటంతో పీవీపి కళాశాల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు తమకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నూతన అంశాలపై విద్యార్థులతో చర్చించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఏ విధంగా పోటీల్లో ఒత్తిడిని తట్టుకోవాలో తెలుస్తుందంటున్నారు.
Skill India : స్కిల్ ఇండియా హ్యాకథాన్‌కు వేల సంఖ్యలో విద్యార్థులు తమ ఆలోచనలను పంపిస్తారు. వాటిలో ఉత్తమమైన ఆలోచనలను ఎంపిక చేస్తారు. మూడు దశల్లో పోటీలు ఉంటాయి. జడ్జిలు ప్రతీ దశలో విద్యార్థులు ప్రాజెక్ట్ అవుట్ పుట్​ను పర్యవేక్షించి నూతన టాస్క్ ఇస్తారు. ఇచ్చిన టాస్క్​ను పూర్తి చేయాలి. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మెరుగైన ఫలితాలను చూపించాల్సి ఉంటుందని పర్యవేక్షకులు చెబుతున్నారు.

Hackathon Program is the Talent of Students : తరగతి గదుల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉపాధి పొందేందుకు, ఆత్మస్థైర్యం పొందేందుకు హ్యాకథాన్‌ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని కోఆర్డినేటర్స్ చెబుతున్నారు. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు రావటంతో పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టిసిపెంట్స్ చెబుతున్నారు. పోటీ పెరగటంతో సహజంగా ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు. తమ ప్రతిభను చాటుకునేందుకు హ్యాకథాన్‌ వేదిక అవుతుందని చెబుతున్నారు. ఇటువంటి పోటీలు విద్యార్థి ఎదుగుదలకు ఉపయోగపడతాయని తెలిపారు.
విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు హ్యాకథాన్ ఉపయోగపడుతుంది. యువకుల కలను సాకారం చేసుకోవటానికి సరైన అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.