ETV Bharat / state

పంచాయితీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్​గా.. సీవీ సుబ్బారెడ్డి అవుట్.. బాలు నాయక్​ ఇన్..!

author img

By

Published : Dec 1, 2022, 7:32 PM IST

Engineer in Chief of Panchayat Raj Department: సీనియారిటీ లిస్టును పక్కనపెట్టి మరీ.. సీవీ సుబ్బారెడ్డిని పంచాయితీరాజ్ శాఖ ఈఎన్​సీగా ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలతోపాటుగా.. మీడియా నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. సీవీ సుబ్బారెడ్డిని నియమించి 24 గంటలు గడవకముందే.. ఆయన స్థానంలో ఎస్టీ వర్గానికి చెందిన బాలూ నాయక్​ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంజనీర్ ఇన్ చీఫ్​గా
Panchayat Raj Department Chief

Balu Naik Appointed as Engineer in Chief of Panchayat Raj Department: పంచాయితీరాజ్ శాఖ ఈఎన్​సీ నియామకాన్ని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ ఇన్ చీఫ్​గా సీవీ సుబ్బారెడ్డిని నియమించి 24 గంటలు గడవకముందే ఆ నిర్ణయాన్ని మార్చుకుని మరో జీవో విడుదల చేశారు. పంచాయితీరాజ్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ పూర్తి అదనపు బాధ్యతలను సీనియారిటీ లిస్టు ప్రకారం ఎస్టీ వర్గానికి చెందిన చీఫ్ ఇంజనీర్ బాలూ నాయక్​కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న సీనియారిటీ లిస్టును పక్కన పెట్టి ఈఎన్సీగా సీవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీనిపై మీడియాలో కథనాలు రావటంతో ఒక్క రోజులోనే ఆయన్ను తప్పించి బాలు నాయక్​కు పంచాయితీరాజ్ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.