ETV Bharat / state

లడ్డూ ధర పెంపుపై చర్చ.. దుర్గగుడి పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు

author img

By

Published : Mar 28, 2023, 8:40 AM IST

Updated : Mar 28, 2023, 11:25 AM IST

Indrakeeladri Board Meeting : విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ లడ్డూ ప్రసాదం ధర పెంపుపై దుర్గగుడి పాలక మండలి సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. 16 అజెండా అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం వివరాలను ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు మీడియాకు తెలిపారు.

దుర్గగుడి పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు
దుర్గగుడి పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు

లడ్డూ ధర పెంపుపై చర్చ.. దుర్గగుడి పాలక మండలి సమావేశంలో పలు తీర్మానాలు

Indrakeeladri Board Meeting : విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ లడ్డూ ప్రసాదం ధర పెంపుపై దుర్గగుడి పాలక మండలి సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. సోమవారం దుర్గగుడి పాలక మండలి సమావేశాన్ని చైర్మన్ కర్నాటి రాంబాబు అధ్యక్షతన మల్లికార్జున మహా మండపం నాలుగో అంతస్తులో నిర్వహించారు. ఈఓ భ్రమరాంబ, వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 16 అజెండా అంశాలపై చర్చించారు. సమావేశ అనంతరం వివరాలను ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు మీడియాకు తెలిపారు.

లడ్డూ ధర పెంపుపై చర్చ : ఈ సందర్భంగా ఆలయ అధికారులు తిరుమల తరహాలో లడ్డూ నాణ్యత ప్రమాణాలు పెంచి ధర పెంచాలనే ప్రతిపాదనను సమావేశంలో తీసుకువచ్చారు. లడ్డూ దిట్టం మార్చి ధర పెంచే విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన తరువాత నిర్ణయం తీసుకోవాలని పాలక మండలి సూచించింది. ఇప్పటికే దర్శనం టిక్కెట్లు 500 రూపాయలు చేయడంపై భక్తులు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజా ప్రతిపాదనపై పునరాలోచించాలని సూచించినట్లు తెలిసింది. పంచ హారతుల సేవలో పాల్గొనే భక్తులకు ఒక టిక్కెట్టుకు ఒక లడ్డు ప్రసాదం ఉచితం ఇవ్వాలని నిర్ణయించామని కర్నాటి రాంబాబు అన్నారు.

ఉచిత దర్శనం.. విరాళాలు : ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే నూతన వధూవరులకు త్వరలో కొంగుముడి పేరిట ఉచిత అంతరాలయ దర్శన అవకాశం కల్పించాలని పాలక మండలి తీర్మానించింది. అమ్మవారి ఉత్సవ మూర్తులకు బంగారు మకర తోరణం చేయించేందుకు అంచనాలు తయారు చేయాల్సిందిగా అధికారులకు సూచించామని చెప్పారు. లక్ష రూపాయలు, అంతకు మించి విరాళాలు ఇచ్చిన భక్తులకు పదేళ్ల పాటు నెలకు ఓసారి అంతరాలయ దర్శనం కల్పిస్తామని అన్నారు.

భక్తుల భద్రత : భక్తజన దర్భార్‌ పేరిట వారానికి ఓసారి భక్తులతో ఛైర్మన్‌, ఈఓ, సభ్యుల ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. కనకదుర్గ నగర్‌ వద్ద భద్రత కట్టుదిట్టానికి కొత్త పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటుకు ప్రతిపాదన చేశామని కర్నాటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద దేవాలయమైన దుర్గమ్మ సన్నిధికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రవేశ మార్గాల వద్ద మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

త్రిసభ్య కమిటీ.. దుకాణాల వివాదం : కేశఖండన శాల వద్ద లోపాలపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒక పాలక మండలి సభ్యునితో మొత్తం త్రిసభ్య కమిటీని వేశామని కేశఖండల శాఖ పర్యవేక్షణకు ఏఈఓ స్థాయి అధికారిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్రిసభ్య కమిటీ వచ్చిన ఆరోపణలు, అక్కడి స్థితితలను పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. కనకదుర్గ నగర్‌లో దుకాణాల వివాదంపైన పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. గతంలో దుకాణ దారులు సవరించిన ధరలను అంగీకరించి దుకాణాలు తీసుకున్నారని అన్నారు. దేవస్థానానికి నిర్దేశించిన మొత్తం చెల్లించాలని అన్నారు. దుకాణాల కేటాయింపు, ధరల విషయంలో తాను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, న్యాయస్థానం ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నానని ఈఓ భ్రమరాంబ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 28, 2023, 11:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.