ETV Bharat / state

RAPE CASE: యువతిపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు తీర్పు.. 20 ఏళ్ల పాటు

author img

By

Published : Apr 19, 2023, 2:17 PM IST

RAPE CASE
RAPE CASE

Vijayawada Government Hospital: నగరం నడిబొడ్డున రద్దీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన కేసు కొలిక్కి వచ్చింది. నిందితులకు జీవితఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. నిందితులకు శిక్ష పడటంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

యువతిపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు తీర్పు.. 20 ఏళ్ల పాటు

Vijayawada Government Hospital: రాష్ట్రంలో సంచలనం రేపిన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులకు మహిళా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని.. పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేసి.. యువతిని ఆసుపత్రిలోనే దాచాడు. దీన్ని అవకాశంగా తీసుకుని మరో ఇద్దరు కామాంధులు తమ కోర్కె తీర్చుకున్నారు. కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేయటంతో నిందితులను గతేడాది అరెస్ట్ చేశారు. అయితే ఏడాది లోనే కేసు విచారణ పూర్తి చేసి ఒకరికి జీవిత ఖైదు, మరో ఇద్దరు నిందితులకు 20 యేళ్లు జైలు శిక్షను విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితులకు జీవితఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శైలజా దేవి తీర్పు నిచ్చారు.

నిందితులకు శిక్ష పడటంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని నున్న వాంబే కాలనీకి చెందిన యువతికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీకాంత్ ఆశ చూపాడు. శ్రీకాంత్ ప్రభుత్వ ఆసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసేవాడు. యువతిని గతేడాది ఓ రోజు రాత్రి సమయంలో ఆసుపత్రికి రప్పించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలిని ఆసుపత్రిలోనే ఉంచి ఉదయం ఇంటికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న యువతిని చూసిన బాబూరావు, పవన్ కల్యాణ్ అనే ఇద్దరు నిందితులు తమ కామవాంఛ తీర్చుకున్నారు. తమ కుమార్తె అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. ఆసుపత్రికి వచ్చి చూడగా నిందితులు యువతితో కనిపించారు.

దీంతో నున్న పోలీసులు అత్యాచార కేసుగా.. నమోదు చేసి నిందితులను గతేడాది అరెస్ట్ చేశారు. ఏడాది కాలంలోనే కేసు ట్రయల్​ను పూర్తి చేశారు. మొత్తం 36 మంది సాక్ష్యులుండగా.. 26 మందిని విచారించారు. వారి సాక్ష్యాధారాలు.. వాదోపవాదాలు విన్న తర్వాత మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏ1 అయిన దారా శ్రీకాంత్​కు జీవిత ఖైదు, 2 వేల రూపాయల జరిమానా విధించారు. బాబూరావు, పవన్ కల్యాణ్​లకు 20 ఏళ్లు చొప్పున జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధించింది. పోలీసులు సీసీ ఫుటేజీ నుంచి విజువల్స్ సేకరించారు. కేసు త్వరితగతిన విచారణ జరిపేందుకు సహకరించారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కోర్టు ఆదేశాలతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని.. కోర్టులో హాజరు పరిచారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం కేసులో నిందితులకు ఈ రోజు మహిళా సెషన్స్ న్యాయమూర్తి శైలజా దేవి శిక్ష విధించారు. అయితే ఆ రోజున దారా శ్రీకాంత్​ జాబ్​ ఇప్పిస్తానని చెప్పి ఆసుపత్రికి తీసుకొచ్చి అమ్మాయిని అత్యాచారం చేశారు.- విష్ణువర్ధన్ ,అడిషనల్ పీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.