ETV Bharat / state

పనులు చేయండి.. అవినీతి ఆపండి ! రసాభాసగా పురసమావేశాలు.. సొంత పార్టీపైనే నేతల ఆరోపణలు

author img

By

Published : Mar 31, 2023, 9:45 PM IST

Updated : Mar 31, 2023, 10:33 PM IST

municipal council meetings: మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు రసాభాసగా సాగాతున్నాయి. ఎన్నికల వేళ అభివృద్ది కానరావడం లేదంటూ, అధికార పార్టీ నేతల ఆరోపణలకు దిగుతున్నారు. ఇది చాలందన్నట్లు, పార్టీలో కొందరు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించొద్దని అంటే ఎలా అని నిలదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ పలు చోట్ల జరిగిన మున్సిపల్ సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనల తీరుపై.. ఈటీవీ భారత్ కథనం..

municipal council meetings
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు

శ్రీ సత్య సాయి జిల్లా: అక్రమ కట్టడాలపై సమధానం చెప్పనన్న అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశం గందరగోళంగా నెలకొంది. అధికార వైసీపీ కౌన్సిలర్లు సమస్యలపై గళం విప్పారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా.. స్పందించడం లేదన్నారు. మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా కట్టడాలు సాగుతున్న అధికారులు నిమ్మకు నెరెత్తినట్లు వ్యవహరిస్తున్నాని ఆరోపించారు. ఇదే అంశంపై స్పందించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి జోక్యం చేసుకొని తాను కౌన్సిలర్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేవలం ఛైర్ పర్సన్ మాత్రం తన సమాధానం చెప్తానని తెలపడంతో అధికార విపక్ష పార్టీల కౌన్సిలర్లు మూకుమ్మడిగా కౌన్సిల్ హాల్​లో నిరసన వ్యక్తం చేశారు.

బాపట్ల జిల్లా: ఖాళీ ఉంటే అక్రమించుకోవచ్చా? అందరం అదే చేస్తే సరిపోతుంది కదా!.. అధికార పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ స్వంత పార్టీ నేతలపై మండిపడ్డారు. బాపట్లజిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన పురపాలక సమావేశం నిర్వహించారు. సమావేశం లోని అజెండాలో 60 అంశాలు పొందుపరిచారు. చీరాల పట్టణంలో మున్సిపల్ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని, ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా అధికారులులకు చీమకుట్టినట్లు లేదని అధికారపార్టీ కి చెందిన 5 వ వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి ధ్వజమెత్తారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాలు స్థలంలో ఆక్రమించి మూడు షాపులు నిర్మిస్తే కనీసం పట్టించుకోకపోగా వాటికి మున్సిపల్ టాక్స్ ఎలా వేశారని టి.పి.ఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, పాలకవర్గం మేల్కొకపోతే విలువైన మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారపార్టీకి చెందిన కౌన్సిలర్లే అనటం కొసమెరుపు.

తిరుపతి జిల్లా: రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఎం సమాధానం చెప్పాలి.. నాయుడుపేట పురపాలక సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. కౌన్సిలర్లు తమ వార్డుల పరిధిలో ఎన్నికై రెండేళ్లు అవుతున్నా ఒక్క పని చేయడం లేదన్నారు. అభివృద్ధి పనులు చేయకుండా రానున్న ఎన్నికల్లో ప్రజలకు ఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏవార్డులో ఎంత అభివృద్ధి చేశారో సభ్యులకు సమాచారం ఇవ్వాలని పట్టుబట్టారు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. వైస్ ఛైర్మన్ రఫీ మాట్లాడుతూ.. అనవసర పనులకు పుర నిధులు వాడుతున్నారన్నార మండిపడ్డారు. ఒక దశలో కమిషనర్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పల్నాడు జిల్లా: అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడుతాం.. పిడుగురాళ్ల పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి. నామ్స్ హైవే టోల్ ప్లాజా నిర్మాణం ఏప్రిల్ 14 లోపు పూర్తి చేస్తామని మాట ఇచ్చి అమలు చేయడం మరిచిపోయారని తెలిపారు. నాన్స్ హైవే వారికి ఎన్నిసార్లు సమయం ఇచ్చిన సమయంలోపు పూర్తి చేయడంలేదని మండిపడ్డారు.నామ్స్ హైవే టోల్ ప్లాజా నిర్మాణం కోసం మహేష్ రెడ్డి తీర్మానం ప్రతిపాదించారు. కౌన్సిలర్లు అందరూ ఈ తీర్మానాన్ని ఆమోదించారు. తాము అధికార పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి హైవే నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం చేస్తామని మహేష్ రెడ్డి తెలిపారు.

ఏలూరు జిల్లా: పెట్రోల్ బాటిల్​తో హజరై..కన్నీటి పర్యంతమై.. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ సమావేశం రసాభాసగా మారింది. పురపాలక సంఘం ఛైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సంకు సురేష్ పెట్రోల్ బాటిల్ తో రావడం కలకలం రేపింది. తన వార్డులో రెండేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని.. వార్డులో తిరగాలంటేనే అసహ్యంగా ఉందని సురేష్ కన్నీటి పర్యంతమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా... నిధుల మంజూరు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ ను సమావేశ మందిరంలో చూపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. తోటి కౌన్సిలర్లు ఆయనకు నచ్చజెప్పి పెట్రోల్ బాటిల్ లాగేసుకున్నారు. వార్డులోకి వెళ్తుంటే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని వారికి సమాధానం చెప్పలేకే, పెట్రోల్ బాటిల్ తో కౌన్సిల్ సమావేశానికి వచ్చినట్లు వైసీపీ కౌన్సిలర్ సురేష్ వాపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 31, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.