ETV Bharat / state

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదు.. అధికారులను ఆదేశించిన సీఎం జగన్​

author img

By

Published : Feb 24, 2023, 7:06 PM IST

Updated : Feb 25, 2023, 6:20 AM IST

jagan
జగన్

CM YS Jagan Review Meeting: వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. వేసవిలో విద్యుత్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని.. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని జగన్ స్పష్టం చేశారు.

CM Review Meeting On Energy Department: వేసవిలో విద్యుత్ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. బొగ్గు నిల్వల విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్ల విషయంలో.. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని విద్యుత్‌ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై జగన్​ చర్చించారు. సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌. జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె. విజయానంద్, పరిశ్రమలశాఖ, ట్రాన్స్‌కో, సీపీడీసీఎల్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేసవి సమీపిస్తోన్న దృష్ట్యా రాష్ట్రంలో పరిస్ధితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేసినట్లు జగన్ తెలిపారు. ఇప్పటికే పవర్‌ ఎక్స్చేంజ్​లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నట్లు తెలిపారు.

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. ఆ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రైతులకు కనెక్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని సీఎం స్పష్టం చేశారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేసినట్లు తెలిపారు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు.. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తి చేస్తామన్నారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 2.18 లక్షలకు పైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించిన అధికారులు.. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 25, 2023, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.