ETV Bharat / state

పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆడబిడ్డ ప్రాణం పోయింది.. డీజీపీకి లేఖలో చంద్రబాబు

author img

By

Published : Dec 8, 2022, 10:37 PM IST

Chandrababu Naidu హత్యకు గురైన తపస్వీని తల్లిదండ్రులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోన్​ చేసి పరామర్శించారు. తపస్వీని హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కాకుండా ముందే చర్యలు తీసుకోవాలని అన్నారు. తపస్వీని హత్యపై డీజీపీ లేఖ రాశారు.

Chandrababu
చంద్రబాబు

Chandrababu Naidu: గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో హత్యకు గురైన తపస్వినీ తల్లిదండ్రులను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్​ ద్వారా పరామర్శించారు. తపస్వినీ హత్యపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. శాంతిభద్రతలు కాపాడటంలో పోలీసుల వైఫల్యం కారణంగా.. రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. గత ఏడాది రమ్య హత్య మరవక ముందే గుంటూరులో.. అలాంటి ఘటన మరోకటి చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. తపస్వినీని జ్జానేశ్వర్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులకు పిర్యాదు చేసినా.. వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్జానేశ్వర్​కు భయపడి తపస్వినీ తన అడ్రస్​ మార్చుకున్నా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఓ ఆడబిడ్డ నిండు ప్రాణం పోయిందని మండిపడ్డారు. మహిళల రక్షణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

దాడులు జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వం స్పందిస్తోందని విమర్శించారు. సంఘటనలు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా.. అవి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని దిశచట్టం పేరుతో వైసీపీ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. తపస్వినీ హత్యే దీనికి నిదర్శనమన్నారు. జ్జానేశ్వర్​ను శిక్షించడం మాత్రమే కాకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.