ETV Bharat / state

ప్రసూతి ఆసుపత్రిలో మహిళా ఉద్యోగుల బీరు పార్టీ.. అసలేం జరిగిందంటే..!

author img

By

Published : Oct 27, 2022, 1:18 PM IST

Beer Party at Government Hospital: ఓ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇద్దరు మహిళా సిబ్బంది బాధ్యత రహితంగా వ్యవహరించారు. వీరితో పాటుగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆసుపత్రిలో పుట్టినరోజు వేడుకల పేరిట బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ సంఘటన తెలంగాణలోని హనుమకొండలో జరిగింది.

Beer Party at Government Hospital
Beer Party at Government Hospital

Beer Party at Government Hospital: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలోని ఓ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా సిబ్బంది బాధ్యత మరిచి వ్యవహరించారు. వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆసుపత్రిలోని ఓ గదిలో బీర్లు తాగుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు వారి స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల పేరిట ఆసుపత్రిలో బీర్లు తాగారు. వీరు విందు చేసుకొనే దృశ్యాలను ఆసుపత్రిలోని రోగుల బంధువులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులకు విషయం తెలిసింది. వారు మహిళ సిబ్బందిని పిలిపించి మందలించి వదిలేశారు.

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బీర్ పార్టీ.. అసలేం జరిగిందంటే..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.