Ban on flexis: సులువుగా లభ్యం, అందుబాటు ధరలు, ఆకర్షణీయంగా ఉండటం వంటి కారణాల వల్ల.. ఫ్లెక్సీల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రచారానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఫ్లెక్సీల వినియోగంపై.. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఆందోళనలో పడిపోయారు. తమ ఉపాధి పరిస్థితి, భవిష్యత్తు ఏంటన్న ఆలోచన.. వారిని నిలవనీయడం లేదు. బ్యానర్ల డిజైనర్లు, ఇనుప ఫ్రేములు తయారుచేసేవారు, ఫ్రేములకు బ్యానర్లు అంటించేవారు.. ఇలా ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది.
సులువుగా లభ్యం, అందుబాటు ధరలు, ఆకర్షణీయంగా ఉండటం వంటి కారణాల వల్ల.. ఫ్లెక్సీల వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రచారానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఫ్లెక్సీల వినియోగంపై.. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఆందోళనలో పడిపోయారు. తమ ఉపాధి పరిస్థితి, భవిష్యత్తు ఏంటన్న ఆలోచన.. వారిని నిలవనీయడం లేదు. బ్యానర్ల డిజైనర్లు, ఇనుప ఫ్రేములు తయారుచేసేవారు, ఫ్రేములకు బ్యానర్లు అంటించేవారు.. ఇలా ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది.
దాదాపు 20 ఏళ్లుగా ఇదే రంగంపై ఆధారపడి జీవిస్తున్న తమకు మరో పని చేతకాదని ఫ్లెక్సీ తయారీదారులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్లుండి నిషేధం విధిస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి మరీ.. ఆధునిక యంత్రాలు కొనుగోలు చేశామని.. ఫ్లెక్సీ తయారీ కేంద్రాల యజమానులు వాపోతున్నారు. అకస్మాత్తుగా ఫ్లెక్సీలపై నిషేధం ఎత్తివేస్తే ఆ అప్పులు ఎలా తీర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై ఎలాంటి ఆలోచన చేయకుండా ఏకపక్షంగా ముందుకువెళ్లడం సరికాదంటున్నారు.
ఫ్లెక్సీ బ్యానర్ల నిషేధంపై పిటిషన్.. హైకోర్టులో పెండింగులో ఉండగా.. మంగళవారం దీనిపై విచారణ జరగనుంది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని... ఫ్లెక్సీ తయారీదారులు, కార్మికులు ఆకాంక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: