ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Nov 15, 2022, 3:01 PM IST

.

TOPNEWS
TOPNEWS

  • ఎంత ఎదిగినా, సొంతూరుపై మమకారం చూపించేవారు: బుర్రిపాలెం వాసులు
    సూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంత స్థాయికి ఎదిగినా సొంత ఊరిపై కృష్ణ మమకారం చూపించేవారని.. గ్రామస్థులు అంటున్నారు. గ్రామానికి తరచుగా రావటంతో పాటు కొన్ని సినిమాల షూటింగ్ కూడా అక్కడే చేశారని అంటున్నారు. గ్రామాభివృద్ధికి చాలా కృషి చేశారని.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గ్రామస్థులు గుర్తుచేసుకుంటున్నారు. అక్కడి పరిస్థితి పై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అలా చేయకపోవడం వల్ల కృష్ణ చాలా నష్టపోయారట.. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలివే
    టాలీవుడ్​లో నటుడిగా కృష్ణ చేసిన సాహసాలు చాలా మందికి తెలిసిన విషయమే. అయితే దర్శకుడిగా ఆయన సృష్టించిన సంచనాల గురించి కొందరికే తెలుసు. ఆయనెందుకు మెగాఫోన్‌ పట్టుకున్నారు? ఆయన ఎన్ని చిత్రాలు తెరకెక్కించారు? తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విశాఖ రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం.. స్థల ఎంపిక పూర్తి
    విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం.. ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి స్థల ఎంపిక పూర్తైంది. నిధుల విడుదలకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడం రైల్వే మంత్రి ఆ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం వంటి సానుకూలతలు.. ప్రధాని పర్యటన సందర్భంగా జతపడ్డాయి. విశాఖ రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్‌ దూరంలోపే ఉన్న వైర్‌లెస్‌ కాలనీలోని స్థలాన్ని.. రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి.. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పవన్ గురించి వద్దండి.. పరిపాలన చూసుకొండి : జనసేన నేత నాగబాబు
    పవన్ ఏది మాట్లాడినా ఒకటికి పది సార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారని జనసేన నేత నాగబాబు స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించి పవన్‌తో మాట్లాడారని నాగబాబు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రేమపెళ్లి చేసుకుందని కుమార్తెపై తల్లిదండ్రుల కర్కశం.. ఏం చేశారంటే?
    తమ ఇష్టాన్ని కాదని, వేరే యువకుణ్ని పెళ్లాడిన కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరిచి ఆమెను అత్తింటి నుంచి అపహరించారు. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గోధుమ వర్ణ కశ్మీర్​లో ప్రీ వెడ్డింగ్​ షూట్​ సందడి.. ఇప్పటికే 1.62 కోట్ల పర్యటకుల రాక
    కశ్మీర్​ అందాలను చూసి ముగ్ధులవ్వని వారు ఎవరుంటారు. మరీ ముఖ్యంగా శరద్​ రుతువులో ఆ ప్రకృతి సోయగం మామూలుగా ఉండదు. ఎంతో మంది పర్యటకులను ఆకర్షించే ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్​ షూట్లకు నెలవుగా మారింది. ఆ గోధుమ వర్ణ శోభను తమ కెమెరాలో బంధించేందుకు కశ్మీర్​కు తరలివస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐదేళ్లుగా వెంటిలేటర్​పై చిన్నారి.. తీస్తే రెండు నిమిషాల్లోనే..
    ఓ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఐదు సంవత్సరాలుగా వెంటిలేటర్​పై ఉంటూ చావుతో పోరాడుతోంది. వెంటిలేటర్​ తీసేస్తే రెండు నిమిషాల కన్నా ఎక్కువ బతకదని వైద్యులు చెబుతున్నారు. ఝార్ఖండ్​కు చెందిన ఏడేళ్ల చిన్నారి దీన గాథ ఇది.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు మార్గం కనుగొనాలి'... ప్రపంచ దేశాలకు మోదీ పిలుపు
    ఇండోనేషియాలోని బాలీలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సహా దేశాధినేతల సమక్షంలో జీ20 శిఖరాగ్ర సదస్సు లాంఛనంగా ప్రారంభమైంది. సదస్సు ప్రారంభం సందర్భంగా బైడెన్‌ను ఆలింగనం చేసుకున్న మోదీ కొద్దిసేపు ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..
    దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.400 పెరిగి రూ.54,600గా ఉంది. కిలో వెండి ధర రూ.953 పెరిగి రూ.64,190 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్​ ఇండియాకు కొత్త కెప్టెన్​..? అతడేనా?
    టీమ్​ఇండియాకు కొత్త సారధిగా మరో పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటి వరకు ఆ స్థానానికి హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లలో ఒకరిని కెప్టెన్ చెయ్యాలని టీమ్​ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే తాజాగా మరో పేరు వినిపించడం చర్చకు దారి తీస్తోంది. ఇంతకి ఆ క్రికెటర్​ ఎవడంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.