ETV Bharat / state

క్రీడా నైపుణ్యాలను బయటకు తీయడమంటే ఇదేనా జగనన్నా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 11:03 AM IST

Adudam Andhra Audience Names Recorded as Players: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 10 వరకు నిర్వహించనున్న 'ఆడుదాం ఆంధ్రా' క్రీడాపోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు వెనకడుగు వేస్తున్నారు. అన్ని సచివాలయాల్లోనూ పోటీలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం అధికారులపై సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తోంది. ప్రభుత్వ ఒత్తిడితో ప్రేక్షకుల్నే క్రీడాకారులుగా జాబితా తయారుచేస్తున్నారు.

adudam_andhra_audience_names_recorded_as_players
adudam_andhra_audience_names_recorded_as_players

క్రీడా నైపుణ్యాలను బయటకు తీయడమంటే ఇదేనా జగనన్నా

Adudam Andhra Audience Names Recorded as Players: ప్రభుత్వం నిర్వహించే ఆడుదాం ఆంధ్రా ’క్రీడా పోటీలు వీక్షిద్దామని పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారా. అయితే మీరు కూడా పోటీల్లో పాల్గొనాల్సిందే. మీకు ఆట వచ్చినా, రాకున్నా ఆడే ఓపిక ఉన్నా లేకపోయినా ఆడాల్సిందే. ఇది మీకు ఆశ్చర్యంగా అనిపించినా సచివాలయాల స్థాయిలో తయారు చేసిన క్రీడాకారుల జాబితాలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

పోటీల్లో పాల్గొనేందుకు తగినంతమంది క్రీడాకారులు లేకపోవడంతో ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక దాదాపు 5 లక్షల మంది ప్రేక్షకులతో క్రీడాకారుల జాబితాలు రూపొందించారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో వీరితోనే పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ స్థాయిలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికి తీయడం అంటే సీఎం జగన్‌ ఉద్దేశంలో ఇలాగేనేమో.

ఉన్నతాధికారుల ఒత్తిడి : ‘గ్రామాల్లో క్రీడా మైదానాలు లేవా.. నైపుణ్యం కలిగిన క్రీడాకారులు లేరా అయినా మాకు అనవసరం. పోటీల్లో పాల్గొంటామని మొదట పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు వెనక్కి పోతున్నారా. ముందుకొచ్చిన వారిలోనూ యువత లేరా. ఏం చేస్తారో, ఎలా చేస్తారో మాకు తెలియదు. ప్రతి సచివాలయం పరిధిలోనూ క్రీడా పోటీలు ప్రారంభించాల్సిందే.’ ఇలా గత రెండు రోజులుగా జిల్లా అధికారులు మండల, పురపాలక అధికారులపైనా వారంతా పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగులపైనా ఒత్తిడి చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ అనుబంధ సంస్థలా పోలీస్​ వ్యవస్థ- ఏపీలో 'వైసీపీ సెక్షన్​'లు అమలు

బలవంతంగా పోటీల నిర్వహణ : అధికారుల ఒత్తిడి వల్ల చివరకు క్రీడలు చూసేందుకు ముందుకొచ్చే వారందరితోనూ బలవంతంగానైనా పోటీలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు సచివాలయాల స్థాయిలో క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్‌ టీంలను ఎంపిక చేశారు. మూడుసార్లు వాయిదా పడిన ‘ఆడుదాం ఆంధ్రా ’ కార్యక్రమం ఎట్టకేలకు 15వేల నాలుగు సచివాలయాల్లో ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 వరకు ఐదు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు.

ఎక్కడ మైదానాలు అందుబాటులో అక్కడే: అన్ని సచివాలయాల్లోనూ విధిగా పోటీలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నా, దాదాపు ఐదు వేల గ్రామాల్లో క్రీడా మైదానాలే లేవు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీల నిర్వహణకు ఇబ్బంది లేకపోయినా క్రికెట్‌ మైదానాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో మండలంలో ఎక్కడ క్రికెట్‌ మైదానాలు అందుబాటులో ఉంటే అక్కడే పోటీలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

కల్లాల్లోనే ఆడుదాం ఆంధ్ర : ఒక సచివాలయం పరిధిలోని టీంలను వేరొక చోటుకు తీసుకెళ్లాలంటే ఖర్చుతో కూడిన అంశం. ఈ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులు, సచివాలయాల ఉద్యోగులకు అప్పగించారు. మిగతా పోటీలు గ్రామాల్లో ఖాళీగా ఉన్న పొలాల్లో, పంటలు నూర్పిళ్లు చేసే స్థలాల్లో నిర్వహించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు.

న్యాయ నిర్ణేతల కొరత : న్యాయ నిర్ణేతలుగా వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించినా దాదాపు 3 వేల చోట్ల వీరి కొరత ఉంది. అలాంటి చోట క్రీడా కోటాలో నియమితులైన సచివాలయాల ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు. మరో పన్నెండు వందల చోట్ల న్యాయనిర్ణేతల అవసరం ఉంది. అలాంటి చోట తగిన అవగాహన లేకపోయినా పంచాయతీ కార్యదర్శులకు అంపైర్‌ బాధ్యత అప్పగిస్తున్నారు. ఎంపిక చేసిన ఐదు క్రీడాంశాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించాలంటే శాప్‌ నిర్దేశించిన ప్రకారం 280 మంది క్రీడాకారులు అవసరం.

Palnadu District: "అరాచకాలకు చిరునామా.. ఆంధ్రా చంబల్‌లోయ".. అక్కడ బతకాలంటే ప్రజాప్రతినిధికి జీ హుజూర్‌ అనాల్సిందే

ప్రేక్షకులను కొరత ఉన్న జట్లలో సర్దుబాటు: పదిహేనువేల నాలుగు గ్రామ, వార్డు సచివాలయాల్లో పోటీల నిర్వహణకు మొత్తం 42 లక్షల మందికిపైగా అవసరమవుతారు. పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి సంఖ్య 37 లక్షలకు మించలేదు. మిగతా 5 లక్షల మంది కోసం ప్రేక్షకులుగా పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారిని ఎంచుకుని టీంల్లో సర్దుబాటు చేశారు. ఐదు క్రీడల్లోనూ విధిగా పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది కలిసి టీంలు వేసి చూపించారు. సచివాలయాల స్థాయిలో పోటీలు నిర్వహించామనిపించి చురుగ్గా ఉన్న క్రీడాకారులను విజేతలుగా చూపించి మండల స్థాయి పోటీలకు పంపేలా ప్రణాళిక రూపొందించారు.

ఓడిన టీంలు కిట్లను తిరిగి అప్పగించాల్సిందే : సచివాలయాల స్థాయిలో నిర్వహించే పోటీల్లో విజయం సాధించే టీంలకే క్రీడా కిట్లు ఇవ్వనున్నారు. ఓడిన టీంల నుంచి కిట్లు మళ్లీ వెనక్కి తీసుకోనున్నారు. ఈ మేరకు సచివాలయాల ఉద్యోగులకు అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అక్కడ పోటీల్లో పాల్గొనే టీంలకు ఇప్పటికే బేసిక్‌ కిట్లు పంపిణీ చేశారు. మండల స్థాయిలో నిర్వహించే పోటీల కోసం ప్రొఫెషనల్‌ క్రీడా కీట్లు అందించనున్నారు. సచివాలయాల స్థాయి పోటీల్లోనూ విజయం సాధించే టీంలోని క్రీడాకారులకే జెర్సీలు ఇస్తారు. వీటిని వేసుకుని మండల స్థాయి పోటీలకు హాజరవ్వాలి.

ఈ పండుగ వచ్చిందంటే చాలు.. వారి వీపు విమానం మోత మోగాల్సిందే..!

పలు జిల్లాలో కనిపించని ఆసక్తి : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, కర్నూలు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో స్పందన అంతంత మాత్రంగా ఉంది. ఈ ఐదు జిల్లాల్లో క్రీడాకారుల రిజిస్ట్రేషన్లు పెద్దగా లేకపోగా వచ్చినవారిలోనూ చాలామంది చివరి క్షణంలో వెనక్కి తగ్గారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 48వేల 893 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. వీరిలో మళ్లీ 12వేల431 మంది వెనక్కి వెళ్లిపోయారు. కృష్ణా జిల్లాలోనూ 89 వేల392 రిజిస్ట్రేషన్లలో 15వేల 690 మంది చివరి క్షణంలో వెనక్కి తగ్గారు.

అస్తవ్యస్తంగా క్రీడా మైదనాలు: తెలుగుదేశం హయాంలో చేపట్టిన మినీ స్టేడియాలు, క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికి నిధులివ్వకుండా విస్మరించిన జగన్‌ ప్రభుత్వం, ఇప్పుడు నిర్వహిస్తున్న క్రీడా పోటీలకు చాలావరకు పాఠశాల మైదానాల పైనే ఆధారపడుతోంది. క్రీడా ప్రాంగణాలు ఇరుగ్గా ఉండడం కాస్త బాగున్న ప్రాంతంలో ‘నాడు - నేడు ’ పనుల కోసం తెచ్చిన ఇసుక, కంకర కారణంగా అధ్వానంగా తయారవడంతో పోటీలు ఎలా నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అన్నింట్లో మనవాళ్లే.. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌లో విజయ సాయిరెడ్డి దందా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.