ETV Bharat / state

వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత.. ఎన్‌ఎస్‌యూఐ నేతల అరెస్ట్​

author img

By

Published : Jan 5, 2023, 5:02 PM IST

Etv Bharat
Etv Bharat

Protest in VBIT college: తెలంగాణ రాష్ట్రం ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థినుల సెల్​ఫోన్​లకు అసభ్యకర సందేశాలు రావడం కలకలం రేపింది. దీనిపై హాస్టల్ వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోవట్లేదనే కారణంతో.. కొందరు అమ్మాయిల తల్లిదండ్రులు కళాశాల ముందు ధర్నాకు దిగారు.

Protest in VBIT college: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ మాల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ మండలం అవుషాపూర్‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిపి వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. అందులోని కొందరి అమ్మాయిల ‌డీపీ ఫొటోలను తీసి వాటిని మార్పింగ్ చేసి గుర్తు తెలియని సెల్​ఫోన్​ల ద్వారా తిరిగి వారికే పంపిస్తున్నారు. భయందోళనకు గురైన అమ్మాయిలు కళాశాల వసతి గృహం వార్డెన్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు భయంగా ఉందని వసతి గృహం నుంచి బయటకు వచ్చి అమ్మాయిలు నిరసన తెలిపారు.

ఈ క్రమంలోనే వార్డెన్ ఘట్​కేసర్ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కొందరు విద్యార్థినుల తల్లిదండ్రులు కళాశాల వద్దకు వచ్చి నిరసన చేపట్టారు. వారం రోజులుగా యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. తల్లిదండ్రుల ఆందోళనకు ఎన్‌ఎస్‌యూఐ నేతలు మద్దతు తెలిపారు. ఇందులో భాగంగానే పోలీసులు, ఎన్​ఎస్​యూఐ నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్​కు తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద ఉద్రిక్తత.. ఎన్‌ఎస్‌యూఐ నేతల అరెస్ట్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.