ETV Bharat / state

నాటు సారాపై ఫిర్యాదు చేశాడని వాలంటీర్​పై దాడి

author img

By

Published : Jun 20, 2020, 12:37 AM IST

కర్నూలు జిల్లాలోని ఎల్​.కే. తండాలో వాలంటీర్​పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. నాటు సారా తయారీపై పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడన్న అనుమానంతో ఈ దాడికి పాల్పడ్డారు.

Villagers attack on volunteer and Police registered case in gadivemula kurnool district
వాలంటీర్​పై గ్రామస్థుల దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా గడివేముల మండలం ఎల్.కే. తండాలో వాలంటీర్​పై దాడి చేశారు నాటు సారా తయారీ దారులు. ఈ నెల 17న తండాలోని నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ తనిఖీల్లో పోలీసుల వెంట వార్డు వాలంటీర్ హనుమంతు నాయక్​ కూడా ఉన్నాడు. అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడని నాటుసారా తయారీదారులు కక్ష పెంచుకున్నారు. శుక్రవారం వారు దాడి చేయటంతో... హనుమంతు నాయక్​కు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.