ETV Bharat / state

చదువుకుంటామంటే.. చేర్చుకోమంటున్నారు!

author img

By

Published : Nov 3, 2021, 7:39 AM IST

చదువుకుంటామంటే.. తమను పాఠశాలలో చేర్చుకోవడం లేదంటూ కర్నూలులోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీట్లన్నీ నిండిపోయాయని, కింద కూర్చునే పరిస్థితి ఉండటంతో చేర్చుకోలేమని ఉపాధ్యాయులు చెబుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

students protest in deo office in karnulu
students protest in deo office in karnulu

ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత ప్రకటనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు నగరంలోని జొహరాపురం ఎస్‌ఆర్‌సీసీ మోడల్‌ స్కూలుకు రావొద్దంటూ నిర్వాహకులు విద్యార్థినులకు టీసీలు ఇచ్చి పంపేశారు. దీంతో వీరందరూ ఇందిరాగాంధీ మున్సిపల్‌ పాఠశాలలో చేరేందుకు వచ్చారు. ఇప్పటికే సీట్లన్నీ నిండిపోయాయని, కింద కూర్చునే పరిస్థితి ఉండటంతో చేర్చుకోలేమని ఉపాధ్యాయులు చెబుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు.

7, 9వ తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులు డీఈవో కార్యాలయానికి టీసీలతో వచ్చారు. కింద కూర్చోనైనా చదువుకుంటామని, మమ్మల్ని స్కూల్లో చేర్చుకోవాలంటూ వారు ప్రాధేయపడుతున్నారు. డీఈవోను కలిసేందుకు మంగళవారం కార్యాలయానికి వచ్చినవారు.. అక్కడ ఉపాధ్యాయులు ధర్నా చేస్తుండడంతో ఆయన్ను కలిసే వీలు లేకుండాపోయింది.

ఇదీ చదవండి:

మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.