ETV Bharat / state

శ్రీశైలం వెళ్లాలనుకుంటున్నారా? ఆలయ వేళల్లో మార్పులు జరిగాయి చూడండి!

author img

By

Published : Jun 30, 2021, 7:18 PM IST

శ్రీశైలం(srisailam) భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు. ఆలయంలో జరిగే పరోక్ష ఆర్జిత సేవలు యథావిధిగా నిర్వహించనున్నారు.

srisailam temple darshan timing changed
srisailam temple darshan timing changed

శ్రీశైలం(Srisailam)లోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ(temple) వేళల్లో మార్పులు చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్. రామారావు తెలిపారు. రేపట్నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు(devotees) శ్రీస్వామి అమ్మ వార్ల దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 3.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆలయ శుద్ధి, సాయంత్రం పూజలు జరుగుతాయన్నారు. ఆలయంలో జరిగే పరోక్ష ఆర్జిత సేవలు యథావిధిగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: cabinet decisions: కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.