ETV Bharat / state

అప్పు తీర్చమంటే..చంపేశారు

author img

By

Published : Mar 11, 2020, 11:22 AM IST

అప్పు తీర్చమన్నందుకే ఓ వ్యక్తిని ఇద్దరు అన్నదమ్ములు మట్టుపెట్టారు. ఈనెల 1వ తేదీన ఆళ్లగడ్డ శివారులోని కేసి పంట కాలువలో ఓ వ్యక్తి శవమై కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని రిమాండ్​కు తరలించారు.

police arrest murder culprits at pedda emminuru
చంద్రమౌళి. నాగరాజు నిందితులు

శ్రీనివాసాచారి హత్య కేసు ఛేదించిన పోలీసులు

అప్పు తీసుకుని తిరిగి తీర్చమన్నందుకు ఓ వ్యక్తిని అన్నదమ్ములు పథకం ప్రకారం హత్య చేశారు. ఈనెల 1వ తేదీన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శివారులోని కేసి పంట కాలువలో శ్రీనివాసాచారి అనే ఓ వ్యక్తి కనిపించాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారించారు. పోస్టుమార్టంలో మృతుడి శరీరంపై కత్తిపోట్లు ఉండటంతో దాన్ని హత్యగా భావించి కేసు నమోదు చేశారు.

ఉయ్యాలవాడ మండలం పెద్ద ఎమ్మనూరుకు చెందిన శ్రీనివాసాచారి..చంద్రమౌళి. నాగరాజు అనే ఇద్దరు అన్నదమ్ముల పొలాన్ని తాకట్టు పెట్టుకుని రూ. 20 లక్షల అప్పు ఇచ్చాడు. ఈ మధ్యనే చంద్రమౌళి మరో రెండు లక్షల అప్పును... శ్రీనివాసాచారి వద్ద నుంచి తీసుకున్నాడు. అప్పు తీర్చాల్సిన సమయం సమీపించడంతో దాన్ని తీర్చలేక... శ్రీనివాసచారిని అడ్డు తొలగించుకోవాలని సోదరులు నిర్ణయించుకున్నారు. అప్పు ఇస్తామని శ్రీనివాసచారిని వెంటబెట్టుకుని వారిద్దరూ బయటకి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న ఐదుగురు గుండాలతో కలిసి అతన్ని హత్య చేసి.... పక్కనే ఉన్న పంట కాలువలో పడేశారు. అప్పు విషయం తెలియడంతో పోలీసులు చంద్రమౌళి, నాగరాజులను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించగా నిజాలు బయటపడ్డాయి. నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీచూడండి. రెండు ప్రాణాలు కాపాడి.. తాను మృత్యుఒడికి చేరుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.