ETV Bharat / state

Lokesh Yuvagalam : అభివాదం చేస్తూ.. ఆప్యాయంగా పలకరిస్తూ... ఉత్సాహంగా సాగుతున్న యువగళం..

author img

By

Published : Apr 25, 2023, 11:00 PM IST

Lokesh Padayatra :తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించి యువగళం నేటితో 81వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో పాదయాత్ర సాగింది. పాదయాత్రకు మద్ధతుగా మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపై వచ్చారు.

Etv Bharat
Etv Bharat

Yuvagalam Padayatra 81st Day : కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. లోకేశ్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు భారీగా రోడ్లపై వచ్చారు. అందరికీ అభివాదం చేస్తూ, ఆప్యాయంగా పలకరించిన లోకేశ్ ఫోటోలు దిగుతూ ముందుకు కదిలారు. తనని కలవడానికి వచ్చిన వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. వచ్చే ఆదాయంతో బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తామని వారికి హామీ ఇచ్చారు. కోసిగి యల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివేకా హత్య కేసును దారి మళ్లించేందుకు సీఎం జగన్‌ శతవిధాలగా ప్రయత్నిస్తున్నారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. అందులో భాగంగానే తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వారి సొంత మీడియాలో ప్రచారం చేశారని... లోకేశ్‌ మండిపడ్డారు. యువగళం యాత్ర ఇప్పటివరకూ 1030.6 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్ర లో 80వ రోజైన నిన్న లోకేశ్ 10.6 కిలో మీటర్లు నడిచారు.

81వ రోజు ఇలా..

ఈ రోజు మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం కోసిగి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. డి.బెళగళ్ పంచాయితీ దొడ్డిలో స్థానికులతో సమావేశం కానున్న లోకేశ్ అనంతరం విఆర్ఓలతో భేటీ నిర్వహించనున్నారు. పల్లెపాడు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశమవనున్నారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు క్రాస్ వద్ద ప్రజలతో మాటామంతీ చేపట్టనున్నారు. లచ్చుమర్రి క్రాస్ సమీపంలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. భోజన విరామం అనంతరం లచ్చుమర్రిలో ఈ-సేవ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. రాత్రికి మాధవరం శివారు విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

బాబాయ్ ని లేపేసిన కేసులో జగన్ ఫ్యామిలీ మొత్తం బుక్కైపోయింది..

ఒక బాబాయ్ ని లేపేసిన కేసులో ఇంకో బాబాయ్ చంచల్ గూడా జైలుకి పోయాడని లోకేశ్ అన్నారు... త్వరలో అబ్బాయిలు కూడా చంచల్ గూడా జైలు కి పోవడం ఖాయమని... చంచల్ గూడా జైలు రావాలి, కావాలి జైలు జగన్ అంటోందని నారా లోకేశ్ ఆరోపించారు. బాబాయ్ హత్య కేసు గురించి రాష్ట్రమంతా ఒకటే చర్చ జరుగుతోందని... అబ్బాయిలు అరెస్ట్ అయ్యేది ఎప్పుడూ అని? బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయంట అని లోకేశ్ అన్నారు. నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది అవినాష్ రెడ్డి నా? లేక జగన్ రెడ్డా అని... లకేష్ కర్నూలు జిల్లా కోసిగి బహిరంగ సభలో ధ్వజమెత్తారు. వైసీపీ అంటే రసిక రాజాల పార్టీ.. అందులో నాయకులంతా న్యూడ్ మోడల్స్. షర్టు, ప్యాంటు విప్పడం ఫ్యాషన్ అనుకుంటారు. ఎంపీ మాధవ్ ప్యాంటు విప్పాడు, ఎమ్మెల్యే అవంతి షర్ట్ విప్పాడు, అంబటి అన్ని విప్పేసాడు. వాళ్ళని చూసి తగ్గేదేలే అంటూ ఇప్పుడు సురేష్ తయారు అయ్యారని లోకేశ్ చెప్పారు చంద్రబాబు గారి మీద రాళ్లు వెయ్యడానికి ఒక డిఎస్పీ డైరెక్షన్ ఇస్తాడని ఆరోపించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.