ETV Bharat / state

కోడుమూరులో ఓటేసిన కోట్ల కుటుంబ సభ్యులు

author img

By

Published : Apr 11, 2019, 4:41 PM IST

కర్నూలు తెదేపా పార్లమెంట్ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కుమారుడు, కుమార్తెలు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు.

కోడుమూరులో ఓటేసిన కోట్ల కుటుంబ సభ్యులు

కోడుమూరులో ఓటేసిన కోట్ల కుటుంబ సభ్యులు

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరిలో తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూర్య ప్రకాశ్ రెడ్డి సోదరుడు హరిచక్రపాణిరెడ్డి... కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్ర రెడ్డి, కుమార్తెలు నివేదిక, చిత్ర ఓటు వేశారు. నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. ఎటువంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలింగ్ సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో కన్నా ఎక్కువ పోలింగ్ శాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. ఓట్లు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

ఇవీ చూడండి : ఒంటిగంట వరకు 48 శాతం పోలింగ్​: ద్వివేది

Intro:ap_knl_132_11_pramukulu_otu hakku_ viniyogam_av_c13

పేరు-నరసింహులు. సెంటర్-మంత్రాలయం
నెంబర్-8008550324

ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు

కర్నూల్ జిల్లా మంత్రాలయం శాసనసభ పరిధిలో గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రముఖులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే, వైస్సార్సీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి తుంగభద్రలో, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మంత్రాలయంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ బిటి నాయుడు మాధవరం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు.


Body:నరసింహులు


Conclusion:మంత్రాలయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.