ETV Bharat / state

'ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందించడమే లక్ష్యం'

author img

By

Published : Oct 8, 2020, 6:23 PM IST

కర్నూలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో జగనన్న విద్యాకానుక కిట్లను స్థానిక ఎమ్మెల్యేలు అందించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

jagananna vidya kanuka kits distribution in  kurnool
జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి... జగనన్న విద్యా దీవెన కిట్లు పంపిణీ చేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తమ ప్రభుత్వం విద్యను అందించేందుకు కృషి చేస్తోందని కేశవరెడ్డి అన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో కోట్ల రూపాయలతో వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముఖ్యమంత్రి జగన్... అభివృద్ధి చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. నగరంలోని ఇందిరా గాంధీ నగరపాలక స్మారక పాఠశాలలో జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు.

పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, పాణ్యం, గడివేముల మండలాల్లో జగనన్న విద్యా కానుక కిట్లను... ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని అన్నారు.

ఇదీ చదవండి:

ప్రపంచంతో పోటీపడేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.