ETV Bharat / state

పేట్రేగిపోతున్న మట్టి మాఫియా.. ప్రవేటు స్థలాల్లోనూ యథేచ్చగా తవ్వకాలు

author img

By

Published : Mar 29, 2023, 10:21 AM IST

Excavation of soil in journalists land: రాష్ట్రంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ప్రభుత్వ స్థలాల్లోనే కాకుండా ప్రైవేటు భూముల్లోనూ యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. కర్నూలులో జర్నలిస్టులకు ఇచ్చిన భూములను సైతం తవ్వేస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలతో ఆ స్థలం ఎందుకూ పనికి రాకుండా పోతుందంటూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Excavation of soil in journalists land
Excavation of soil in journalists land

జర్నలిస్టుల జాగాలో జోరుగా మట్టి తవ్వకాలు.. ప్రవేటు స్థలాలనూ వదని మాఫియా!

Excavation of soil in journalists land: రాష్ట్రంలో అక్రమార్కులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా భూకబ్జాలు.. ఇసుక దందాలు.. మట్టి మాఫియాలు.. ఇలా రాష్ట్రాన్ని గుళ్ల చేస్తున్నారు. ఏప్పుడేతే వేసీపీ ఫ్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్రమాలే.. తాజాగా కర్నూలు జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులు.. తమకు ఇళ్ల స్థలాలు కావాలని ఎన్నో ఏళ్లుగా పోరాడి.. పోరాడి చివరగా 2009లో సాధించారు. 250 మంది జర్నలిస్టులు ఒకటిగా ఏర్పడి.. జగన్నాథగట్టు ప్రాంతంలో కర్నూలు జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకుని.. 15 ఎకరాల స్థలాన్ని 80 లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరికి 3.5 సెంట్ల ప్లాట్లు వచ్చాయి. ఈ స్థలాన్ని కొంత మంది రాజకీయ నాయకుల అండతో.. పలుమార్లు కొందరు కబ్జా చేసేందుకు యత్నించారు. జర్నలిస్టులు ఈ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే వస్తున్నట్లు తెలిపారు.. గతంలో ఈ స్థలంలో మట్టి మాఫియా మట్టిని తవ్వేందుకు యత్నించగా.. పోలీసుల సాయంతో.. తవ్వకాలను అడ్డుకున్నారు.

జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడానికి ఈ స్థలంలో రోడ్డు వేస్తామని.. ఇంకా ఏవేవో చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. కాని ఆ హామీలను నెరవేర్చకుండా ఇక్కడ మట్టి తవ్వేస్తున్నారు.. గతంలో ఇక్కడ మట్టి తవ్వేయడాన్ని పోలీసుల సాయంతో.. తవ్వకాలను అడ్డుకున్నాము. అయితే ఇప్పుడు మళ్లీ ఎవరికీ తెలియకుండా రహస్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టి తవ్వకం కారణంగా పేద జర్నలిస్టులు చాలా నష్టపోవలసి వచ్చింది. అసలుకే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం కష్టం అనుకుంటుంటే ఇప్పుడు మట్టిని తవ్వి దీన్ని ఒక లోయ మాదిరిగా చేశారు.- సుబ్బయ్య, జర్నలిస్టు సంఘం నాయకుడు

జర్నలిస్టులు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు ఈ విధమైన ప్రమాద పరిస్థితులు ఎదుర్కుంటున్నాము. దగ్గర దగ్గర 60 స్థలాల వరకు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ అక్రమాల వెనుకాల ఎవరు ఉన్నారో గుర్తించి.. దీన్ని సుమోటోగా తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము.- మహేశ్, జర్నలిస్టు సంఘం నాయకుడు

10 అడుగుల లోతు వరకూ.. ఈ మధ్యకాలంలో జగన్నాథగట్టు ప్రాంతంలో ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేశారు. దానితో పాటుగా మరికొన్ని విద్యా సంస్థల భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో.. ఈ ప్రాంతంలోని భూములకు భారీగా ధరలు పెరిగాయి. ఇదే అదునుగా భావించి.. మా స్థలాలపై కన్నేసిన మట్టి మాఫియా.. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపట్టిందని జర్నలిస్టులంటున్నారు. రాత్రి వేళల్లో ప్రొక్లెయినర్లతో అక్రమంగా మట్టిని తవ్వి.. టిప్పర్లతో తరలించేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి చూడగా.. 10 అడుగుల లోతు వరకు భూమిని తవ్వేయటంతో.. సుమారు 60 ఇళ్ల స్థలాలు ఎందుకూ పనికిరాకుండా పోయాయని.. జర్నలిస్టులు ఆవేదన చెందుతున్నారు. తమ భూములకే రక్షణ లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూములకు రక్షణ కల్పించాలని జర్నలిస్టులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.