ETV Bharat / state

భారీ వర్షాలతో కర్నూలు జిల్లా అతలాకుతలం

author img

By

Published : Sep 18, 2019, 2:28 PM IST

మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో... కర్నూలు జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. పంటలు నీట మునిగాయి. కల్వర్టు తెగి... రాకపోకలు స్తంభించాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

rain

భారీ వర్షాలతో కర్నూలు జిల్లా అతలాకుతలం

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చిప్పగిరి, ఓర్వకల్లు, బండి ఆత్మకూరు, ఆస్పరి, హోళగుంద, మంత్రాలయం, కోసిగి, మిడుతూరు మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆదోనిలో ఆవుదూడవంక పొంగి ప్రవహిస్తుడంటం వల్ల సమీపంలోని ఇళ్లలోకి నీరుచేరింది. పాములపాడు మండలంలో పంటపొలాలు చెరువును తలపిస్తున్నాయి. కోసిగిలో చాపవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డోన్ మండలం దేవరబండ వద్ద రహదారిపై విద్యుత్ స్తంభం కూలిపోయింది.

హొళగుంద మండలం ఇంగళహాల్-ఎండీ హళ్లి మధ్య వంక పొంగిపొర్లుతోంది. మహానంది మండలంలో తమడపల్లి చెరువు ప్రమాదకరంగా మారింది. బుక్కాపురం గ్రామానికి ప్రమాదం పొంచి ఉండటంతో.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలూరు నియోజకవర్గంలో గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లాయి. పత్తి పంట నీట మునిగింది.

గోస్పాడు మండలంలోని జులేపల్లె-పసురపాడు మధ్య భారీ వర్షాలకు రహదారి దెబ్బతింది. ఫలితంగా నంద్యాల-కోవెలకుంట్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల మండలంలోని కొట్టాల వద్ద కల్వర్టు తెగడంతో రాకపోకలు స్తంభించాయి.

Intro:కరువు నేలలో... కృత్రిమ అడవుల పెంపకం ...
ఐదు వేల హెక్టార్లలో పరుచుకున్న పచ్చదనం...
పక్షి జాతులు అడవి జంతువులకు ఆవాసాలుగా మరి నా అడవులు...
కృత్రిమ ఆవుల పెంపకానికి రూ.12 కోట్లు ఖర్చు... 3 లక్షల మందికి ఉపాధి ...
మోడు వారిన నేలపై పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ అధికారులు చేసిన కృషి ఫలించింది. ప్రభుత్వ భూముల్లో పచ్చదనం సంతరించుకుంది.. కనుచూపు మేరకు కం పలు రాళ్లు తో ఉన్న ప్రాంతం ఇప్పుడు పచ్చదనంతో కళకళలాడుతుంది . . గత నాలుగేళ్లపాటు అటవీశాఖ అధికారులు కృత్రిమ అడవుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. దీంతో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు అంతరించిపోతున్న పక్షి జాతులు, అడవి జంతువులకు అవాసలుగా మారాయి . లక్షల మంది కూలీలకు ఉపాధి లభించింది..
వివరాల్లోకి వెళితే ...
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం లోని గుట్ట పాలెం, రంగ నాథ పురం అటవీ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుకు కృత్రిమ అడవుల పెంపకం చేపట్టారు.
ఎందుకు పనికిరాని కొండలు గుట్టలు ప్రాంతాలు ఇప్పుడు వివిధ రకాల మొక్కల తో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి.. రంగ నాథ పురం అటవీ ప్రాంతంలో రెండు వందల ఎకరాలు... గుట్టపాలెం ఫారెస్ట్ మేకవారిపల్లె ఎర్రగుటలో రెండువంద ల ఎకరాల్లో అడవులు పెరుగుతున్నాయి. ఇప్పుటి వరకు మండలంలో మొత్తం ఐదు వేల హెక్టార్లలో పచ్చదనం సంతరించుకుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో లక్ష మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. వీటిలో ఎర్రచందనం, రావి , వేప, నారే బి, మద్ది , రావి , తపసి, అల్లనేరేడు ,, ఉసిరి, ని రుద్ది, కానుగా , చింత తదితర మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి . మొక్కల మధ్య మూడు మీటర్ల దూరం ఉంచారు నీటి సంరక్షణకు వీటి మధ్యలో 40 నీటి కుంటలో నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పశువులు మేకలు గొర్రెలు రాకుండా చుట్టూ 5 మీటర్ల లోతుతో కందకాలు తవ్వి oచారు . అరెల కిందట చే పట్టిన అభివృద్ధి పనులు ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి. ఈ కొండ ప్రాంతమంతా పచ్చదనంతో నిండుకుని ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి . అదేవిధంగా పర్యావరణానికి మేలు జరిగి వర్షాలు కూడా అనుకూలిస్తున్నాయి .. ప్రతి ఏడాది మొక్కల సంరక్షణకు వన సంరక్షణ సమితి ఆధ్వర్యంలో లో చెట్లకు పాదులు తీయడం చెట్ల మధ్యలో పిచ్చిమొక్కలు లేకుండా తొలగించడం వంటి పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి .. దీంతో పలువురు పలువురు గ్రామీణ ప్రాంత వాసులకు ఉపాధి కలుగుతుంది.


Body:కుత్రిమ అడవుల అభివృద్ధి


Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కలికిరి మండలంలో కృత్రిమ అడవుల పెంపకం సత్ఫలితాలను ఇచ్చిండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.